Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 3rd Test: అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన నాథన్ లియాన్.. ఆ లిస్ట్‌లో మొదటి స్థానానికి కూడా..

రెండు ఇన్నింగ్స్‌లలోనూ లియాన్ ధాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. అయితే రెండు మ్యాచ్‌లు ఓడిన..

IND vs AUS 3rd Test: అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన నాథన్ లియాన్.. ఆ లిస్ట్‌లో మొదటి స్థానానికి కూడా..
Nathan Lyon
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 03, 2023 | 7:45 AM

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్వల్ప పరుగులే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌ ముగిసే సరికి ఆసీస్ ముందు కేవలం 75 పరుగుల లక్ష్యాన్నే నిర్దేశించింది. ఇక ప్రత్యర్థి జట్టులోని వెటరన్ స్పిన్నర్ నాథన్ లియాన్ 8 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. ఫలితంగా టీమిండియా ఓటమి దిశగా ప్రయాణిస్తోంది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ లియాన్ ధాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. అయితే రెండు మ్యాచ్‌లు ఓడిన తర్వాత ఆసీస్ స్పిన్నర్ లియాన్ ఈ టెస్ట్‌లో భారత్‌ను ఓటమి దిశగా నెట్టడమే కాకుండా.. ఈ మ్యాచ్‌లో అరుదైన ఘనతను సాధించాడు. దీని కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భారత మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.

భాతర్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 111 వికెట్లు తీసి అనిల్ కుంబ్లే ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉండేవాడు. అయితే తాజాగా నాథన్ లియాన్ ఈ రోజు మ్యాచ్‌లో 57వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ వికెట్ తీయడంతో 112వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా కుంబ్లే 111 వికెట్లతో రెండో స్థానంలో 112వ వికెట్లతో లియాన్ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. ఇక ఈ ఇద్దరి తర్వాత అశ్విన్ 106 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు..

  1. నాథన్ లియాన్- 112 వికెట్లు
  2. అనిల్ కుంబ్లే- 111 వికెట్లు
  3. రవిచంద్రన్ అశ్విన్- 106 వికెట్లు
  4. హర్భజన్ సింగ్- 95 వికెట్లు
  5. రవీంద్ర జడేజా- 84 వికెట్లు

కాగా, ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 197 పరుగుల వద్ద ఆలౌటైంది. రవీంద్ర జడేజా 4 వికెట్లు తీయగా.. అశ్విన్, ఉమేష్ యాదవ్ చెరో 3 వికెట్లతో రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్ 163 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కేవలం 75 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే సాధించింది టీమిండియా. మూడో రోజు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ ఆడనుంది. ఇక నాథన్ లియాన్ టీమిండియా మొదటి ఇన్నింగ్స్ సమయంలో 35 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..