PSL 2023: 8 ఫోర్లు, 3 సిక్సులు.. 208 స్ట్రైక్‌రేట్‌తో ధావన్ టీంమేట్ ధనాధన్ ఇన్నింగ్స్‌.. ఫుల్ జోష్‌లో పంజాబ్ ఫ్యాన్స్..

LQ vs QG: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో గురువారం లాహోర్ క్వాలండర్స్ జట్టు క్వెట్టా గ్లాడియేటర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లాహోర్ క్వాలండర్స్ 17 పరుగుల తేడాతో క్వెట్టా గ్లాడియేటర్స్‌పై విజయం సాధించింది.

PSL 2023: 8 ఫోర్లు, 3 సిక్సులు.. 208 స్ట్రైక్‌రేట్‌తో ధావన్ టీంమేట్ ధనాధన్ ఇన్నింగ్స్‌.. ఫుల్ జోష్‌లో పంజాబ్ ఫ్యాన్స్..
Sikandar Raza Psl 2023
Follow us
Venkata Chari

|

Updated on: Mar 03, 2023 | 7:36 AM

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో గురువారం లాహోర్ క్వాలండర్స్ జట్టు క్వెట్టా గ్లాడియేటర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లాహోర్ క్వాలండర్స్ 17 పరుగుల తేడాతో క్వెట్టా గ్లాడియేటర్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు 149 పరుగుల విజయ లక్ష్యం ఉండగా, సర్ఫరాజ్ అహ్మద్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున విల్ సమీద్ 32 పరుగులు చేశాడు. కాగా, జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 27 పరుగులు చేశాడు. అదే సమయంలో లాహోర్ ఖలందర్స్ తరపున హరీస్ రౌఫ్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. హరీస్ రవూఫ్ 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి ముగ్గురు ఆటగాళ్లను పెవిలియన్ చేర్చాడు. అలాగే రషీద్ ఖాన్ 2 వికెట్లను పడగొట్టాడు. డేవిడ్ వీజే మార్టిన్ గప్టిల్‌ను కూడా ఒక వికెట్ పడగొట్టాడు.

మ్యాచ్‌నే మార్చేసిన సికందర్ రజా ఇన్నింగ్స్..

మరోవైపు, ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, క్వెట్టా గ్లాడియేటర్స్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ ఖలందర్స్ జట్టు 19.2 ఓవర్లలో 148 పరుగులకు కుప్పకూలింది.

ఇవి కూడా చదవండి

లాహోర్ ఖలందర్స్ తరపున సికందర్ రజా అత్యధిక పరుగులు చేశాడు. సికందర్ రజా 34 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. లాహోర్ ఖలందర్స్‌కు చెందిన 7గురు బ్యాట్స్‌మెన్ రెండెంకల ఫిగర్‌ను తాకలేకపోయారు. సికందర్ రజా తర్వాత రషీద్ ఖాన్ జట్టులో అత్యధిక పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ 20 బంతుల్లో 21 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే