- Telugu News Photo Gallery Technology photos Oukitel WP19 gets a 21,000mah jumbo sized battery that lasts for 94 days on standby check here for price and specifications
Oukitel WP19: జంబో బ్యాటరీ అంటే ఇదేనేమో..? ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఒకసారి చార్జ్ చేస్తే.. 95 రోజుల పాటు పని చేయడం ఖాయం..!
ఎక్కువ సమయం పాటు నిలవని బ్యాటరీతో, పదే పదే మీ స్మార్ట్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టి విసిగిపోతున్నారా..? అయితే ఇకపై ఆ అవసరం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. దాని బ్యాటరీ సామర్థ్యం ఏకంగా 21000 mAh. ఇంకా ఈ ఫోన్‌కు ఒక సారి చార్జ్ చేస్తే సుమారు 95 రోజుల వరకు చార్జింగ్ అవసరంలేదు. మరి ఆ ఫోన్ గురించి పూర్తి వివరాలేమిటో మనం ఇప్పుడు చూద్దాం..
Updated on: Mar 03, 2023 | 8:20 AM

ఎక్కువ కాలం పాటు ఉండే పెద్ద బ్యాటరీ బ్యాకప్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చాలా మంది చూస్తున్నారు. ఇక కొందరు అయితే తమ ఫోన్ ఛార్జ్‌ని ఎక్కువ సమయం పాటు కాపాడుకోవడానికి ఇతర థర్డ్ పార్టీ యాప్‌లను కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

అయితే ఇప్పుడు ఆ అవసరం లేకుండా మార్కెట్‌లో ఒక ఫోన్ ఉంది. దాని బ్యాటరీ సామర్థ్యం 21000 mAh. అంతేకాక ఈ ఫోన్‌ను ఒక సారి చార్జ్ చేస్తే సుమారు 95 రోజుల పాటు పని చేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ పేరు Oukitel WP19. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ Oukitel, గ్లోబల్‌గా సరికొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను గత ఆగస్టులో విడుదల చేసింది. ఇక ఈ ఫోన్ ధర 269.99 USD. అంటే భారతదేశంలో దీని ధర సుమారుగా 22 వేల రూపాయలు ఉంటుంది.

6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇంకా ఇది మీ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి బాగా పని చేస్తుంది. 21000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇచ్చే ఈ ఫోన్.. 8 GB RAM, 256 GB ఇంటర్నెల్ మెమోరీతో వస్తుంది.

అలాగే వినియోగదారుల సౌలభ్యం కోసం Google Payతో పాటు NFCకి వంటి పలు యాప్‌లకు కూడా Oukitel WP19 సప్పోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించింది Oukitel కంపెనీ.

64 మెగాపిక్సెల్స్ సామర్థ్యం కలిగిన ప్రైమరీ కెమెరా LED ఫ్లాష్ లైట్‌తో సహా వస్తుంది. అదే కాకుండా 2ఎంపీ, 20 ఎంపీ సెంకండరీ కెమెరాలు కూడా వెనుక భాగంలో ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్ కెమెరా కూడా ఫోన్ ముందుబాగంలో ఉంది.

Oukitel అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేస్తున్న సమాచారం ప్రకారం, ఈ ఫోన్ బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై 2252 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అంటే 94 రోజుల పాటు ఛార్జ్ నిలిచిపోతుంది. ఇంకా

ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ ఇంకా డ్రాప్ ప్రూఫ్ అని కూడా Oukitel కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తోంది.




