Narender Vaitla |
Updated on: Mar 02, 2023 | 9:31 PM
ఐఫోన్ సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ అయ్యేందుకు సమయం ఆసన్నమవుతోంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ నాటికి ఐఫోన్ 15 మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.
యాపిల్ నుంచి కొత్త ఫోన్ రానున్న నేపథ్యంలో ఐఫోన్ 15 ఫీచర్లకు సంబంధించిన కొన్ని లీకులు వినిపిస్తున్నాయి. వీటి ప్రకారం ఐఫోన్ 14తో పోల్చితే భారీగా మార్పులతో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం.
ఈ ఫోన్‌లో 6.2 ఇంచెస్ స్క్రీన్ ఉండనున్నట్లు టాక్. హైఎండ్ ప్రొ మోడల్స్ న్యూ ఏ17 బయోనిక్ ఎస్ఓసీ చిప్‌సెట్‌తో ఐఫోన్ 15 ఏ16 బయోనిక్ చిప్‌ను కలిగిఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఇక ఐఫోన్ 15 బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకపోయినప్పటికీ. ఈ ఫోన్‌లో టైప్ సీ పోర్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ యూజర్లకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఐఫోన్ 15లో 45డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెమెరా విషయానికొస్తే ఇందులో 48 మెగాపిక్సెల్స్‌తో కూడి వైడ్ కెమెరాను అందించనున్నట్లు సమాచారం.