Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grah Gochar 2023: ఏప్రిల్‌ నుంచి ఈ 5 రాశులపై కనక వర్షం.. ఒకేసారి ఏర్పడనున్న మూడు యోగాలు..

సూర్యుడు, గురు గ్రహాల కలయిక వల్ల నవ పంచమ యోగం, బుధుడు-సూర్యుడు సంయోగం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడనున్నాయి. ఇక ఈ గ్రహాల..

Grah Gochar 2023: ఏప్రిల్‌ నుంచి ఈ 5 రాశులపై కనక వర్షం.. ఒకేసారి ఏర్పడనున్న మూడు యోగాలు..
Horoscope
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 03, 2023 | 6:15 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా రాశుల మార్పు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే శని గ్రహం తన సొంతరాశి అయిన కుంభరాశిలోకి జనవరి 17న ప్రవేశించి అక్కడే తిష్టవేశాడు. అలాగే ఛాయా గ్రహాలైన రాహువు మేషరాశిలోనూ, కేతువు తులరాశిలోనే సంచరిస్తున్నాయి. అయితే వచ్చే నెలలో అంటే ఏప్రిల్ 22న దేవగురు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. అంతేకాక సూర్యుడు, గురు గ్రహాల కలయిక వల్ల నవ పంచమ యోగం, బుధుడు-సూర్యుడు సంయోగం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడనున్నాయి. ఇక ఈ గ్రహాల సంచారం, యోగాల కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో ఆనందం వెల్లివిరియనుంది. మరి ఏయే రాశులవారి జీవితాలో సుఖసంతోషాలతో వికసించనున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. మేషరాశి: బృహస్పతి సంచారం మేషరాశివారికి ఆనందాన్ని ఇస్తుంది.  ఈ సమయంలో మీ రాశిచక్రం మొదటి ఇంట్లో రాహు, సూర్యుడు, గురు మరియు బుధుల కలయిక జరగబోతోంది. ఈ అరుదైన కలయిక మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. అంతేకాకుండా మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది.
  2. మిథున రాశి: రాహువు, సూర్యుడు, బుధుడు, గురు గ్రహాల కలయిక మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిచక్రంలోని 11వ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతుంది. దీంతో ఈ రాశివారు స్పెషల్ బెనిఫిట్స్ పొందుతారు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం లాభిస్తుంది. మీరు ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
  3. మకరరాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ యోగం మకరం యొక్క నాల్గవ ఇంటిలో ఏర్పడబోతోంది. దీంతో మీరు మానసికంగా స్ట్రాంగ్ అవుతారు. ఈసమయంలో ఏదైనా విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది.
  4. సింహరాశి: ఈ నాలుగు గ్రహాల కలయిక సింహరాశి యొక్క తొమ్మిదవ ఇంట్లో జరగబోతోంది. దీంతో వీరికి ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మీనరాశి: ఈ గ్రహాల కూటమి మీనం యొక్క రెండవ ఇంటిలో ఏర్పడబోతోంది. దీంతో ఈ రాశివారు ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..