Shani Yoga: ఈ మూడు శని శుభయోగాలున్న వ్యక్తికి లక్కే లక్కు.. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు..
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఏ వ్యక్తి జాతకంలో శనీశ్వరుడు 3 శుభ యోగాలు ఏర్పడినట్లయితే.. ఆ వ్యక్తి జీవితం సుఖ సంపదలతో సాగుతుంది. అలాంటి వ్యక్తి ధనవంతుడు అవుతాడు. శని ఈ మూడు శుభ యోగాలు శశ యోగం, సప్త మస్త యోగం, శని శుక్ర యోగం. ఈ మూడు శని యోగాల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా శనీశ్వరుడు పేరు వినగానే ప్రజలు చాలా భయపడతారు. ఎందుకంటే శని అశుభమని.. అతని నీడ తమపై పడితే అన్ని కష్టాలే అని భావిస్తారు. ఏలినాటి శని ప్రభావంతో శనీశ్వరుడు ఆయా రాశుల వారికి అన్ని రకాల సమస్యలను, ఆర్థిక నష్టాలను కలిగిస్తూ ఉంటాడు. వేద జ్యోతిషశాస్త్రంలో.. శనీశ్వరుడు న్యాయం, కర్మ ఫలితాలను ప్రసాదించేవాడుగా పరిగణించబడతాడు. శనీశ్వరుడు ప్రజలకు కష్టనష్టాలను కలుగజేయడమే కాదు.. ప్రజలు చేసిన పనుల ఆధారంగా శుభ లేదా అశుభ ఫలితాలను ఇస్తాడు.
శనీశ్వరుడుని ఎంత సమస్యాత్మకంగా భావిస్తారో.. అంత శుభప్రదం కారకుడు కూడా.. ఎవరి జాతకంలో శనీశ్వరుడు శుభం, తగిన ఇంట్లో ఉంటే.. ఆ వ్యక్తి జీవితం మారుతుంది. శనీశ్వరుడి సంతోషంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో అన్ని రకాల సుఖాలు, విలాసాలు పొందుతాడు.
ఒక వ్యక్తి జాతకంలో శనీశ్వరుడు కొన్ని యోగాలను కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి జీవితంలో శనీశ్వరుడు ఆశీర్వాదం లభిస్తుంది. మనిషి జీవితం సంతోషంగా సాగుతుంది. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడదు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఏ వ్యక్తి జాతకంలో శనీశ్వరుడు 3 శుభ యోగాలు ఏర్పడినట్లయితే.. ఆ వ్యక్తి జీవితం సుఖ సంపదలతో సాగుతుంది. అలాంటి వ్యక్తి ధనవంతుడు అవుతాడు. శని ఈ మూడు శుభ యోగాలు శశ యోగం, సప్త మస్త యోగం, శని శుక్ర యోగం. ఈ మూడు శని యోగాల గురించి తెలుసుకుందాం.
శశ యోగం పంచ మహాపురుష యోగంలో శశ యోగం ఒకటి. ఇది చాలా శుభప్రదమైన యోగం. ఒక వ్యక్తి జాతకంలో శని మకరం, కుంభం, తులారాశిలో ఉన్నప్పుడు ఈ రకమైన శుభ యోగం ఏర్పడుతుంది. మకరం , కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు. శని తులారాశిలో ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు.. అంటే శని ఈ రాశిలో ఉన్నప్పుడు, శని దేవుడు ఉత్తమ ఫలితాలను ఇస్తాడు. జాతకంలో శశ యోగం ఏర్పడాలంటే లగ్నం నుంచి శని కేంద్రస్థానంలో ఉండడం తప్పనిసరి. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో ఈ యోగం ఏర్పడుతుందో, వారి జీవితంలో చాలా ఆనందం, సుఖ, సంతోషాలు లభిస్తాయి. ఎవరి జాతకంలో శశ యోగం ఏర్పడిందో.. వారు తమ రంగంలో మంచి స్థానాన్ని సాధిస్తారు. వీరికి డబ్బుకు లోటు ఉండదు.
సప్త మస్త యోగం సప్త మస్థ శని యోగం జాతకంలో శనీశ్వరుడు ఏడవ ఇంట్లో ఉన్నప్పుడు శనీశ్వరుడు శుభ కారకంగా ఉంటాడు. ఎవరి జాతకంలో శని సప్తమంలో ఉంటాడో.. ఆ వ్యక్తి చాలా డబ్బు సంపాదిస్తాడు. అలాంటి వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తారు. జాతకంలో శని ఏడవ ఇల్లు జీవిత భాగస్వామి, భాగస్వామ్యాన్ని వెల్లడిస్తుంది. అటువంటి పరిస్థితిలో.. ఏడవ ఇంట్లో శని ఉండడంతో వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే వివాహం ఆలస్యమైనప్పటికీ.. వివాహం తర్వాత వీరి అదృష్టం మరింత అధికమవుతుంది.
శని శుక్ర యోగం చాలా పవిత్రమైన యోగాలలో శని-శుక్ర యోగం ఒకటిగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రంలో, శని స్థిరత్వానికి అధిపతి అయితే శుక్రుడు ఆనందం, వైభవం, ఆనందాన్ని ఇచ్చే గ్రాహం. అటువంటి పరిస్థితిలో.. ఎవరి జాతకంలో శని, శుక్రుడు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు.. అప్పుడు శని-శుక్ర యోగం ఏర్పడుతుంది. జాతకంలో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. శని దృష్టి శుక్రునిపై పడితే పెద్దగా ప్రయోజనం ఉండదు. జాతకంలో శని-శుక్ర యోగంతో వ్యక్తి జీవితంలో అన్ని రకాల ఆనందాలు లభిస్తాయి. సమాజంలో మంచి గౌరవం, పురోగతి లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)