AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2023: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా.. హొలీ రోజున వాస్తు నియమాలతో పూజ చేసి చూడండి.. అదృష్టం మీ సొంతం..

హొలీ పండగ జరుపుకునే విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.  ఆ నియమాలను పాటిస్తూ హొలీ సంబరాలను జరుపుకుంటే.. ఆ ఇంట్లో వాస్తు దోషాలు , ఆర్ధిక ఇబ్బందులు, తొలగి.. సుఖ సంపదలు లభిస్తాయని విశ్వాసం. 

Holi 2023: ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులా.. హొలీ రోజున వాస్తు నియమాలతో పూజ చేసి చూడండి.. అదృష్టం మీ సొంతం..
Holi 2023
Surya Kala
|

Updated on: Mar 02, 2023 | 10:46 AM

Share

హిందూ సంప్రదాయంలో హొలీ ఒక ముఖ్యమైన పండగ. ప్రతి ఏడాది పాల్గుణ మాసం పౌర్ణమి రోజున హొలీ పండగను జరుపుకుంటారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రంగుల కేళి హొలీ సంబురాలు మొదలయ్యాయి. ఈ నెల 8వ తేదీన హొలీ పండుగ జరుపుకోవడానికి పిల్లలు, పెద్దలు రెడీ అవుతున్నారు. ఈ పండగ రోజున పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ.. రంగులు జల్లుకుంటారు. సంతోషముగా గడుపుతారు. ప్రతి ఒక్కరి జీవితం రంగుల మయం కావాలని కోరుకుంటారు. అయితే హొలీ పండగ జరుపుకునే విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.  ఆ నియమాలను పాటిస్తూ హొలీ సంబరాలను జరుపుకుంటే.. ఆ ఇంట్లో వాస్తు దోషాలు , ఆర్ధిక ఇబ్బందులు, తొలగి.. సుఖ సంపదలు లభిస్తాయని విశ్వాసం.

వినాయకుడిని ఎలా పూజించాలంటే.. 

హోలీ పండుగ రోజున ముందుగా వినాయకుడిని పూజించి.. గులాబీ రంగుని గణేశుడి అద్ది.. అనంతరం.. నైవేద్యంగా స్వీట్లను సమర్పించాలి. అనంతరం కుటుంబ సభ్యులు హోలీని జరుపుకోవాలి. ఇలా చేయడం వలన ఆ ఇంటి సభ్యుల మీద గణేశుడు అనుగ్రహం ఏడాది పొడవునా ఉంటుందని చేపట్టిన పనులు ఎటువంటి విఘ్నాలు జరగకుండా చూస్తాడని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

హొలీ రోజున ఇంటిలో పూజని ఏ విధంగా చేయాలంటే.. 

హొలీ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, రాధా కృష్ణలను ప్రత్యేకంగా పూజించాలి. అంతేకాదు హోలీ పండుగ రోజున కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే.. ఆ ఇంట్లో ఏడాది పొడవునా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. వాస్తు శాస్త్రం ప్రకారం హొలీ సంబరాలను ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర లేదా ఇంటి ప్రాంగణంలో జరుపుకోవడం మేలు జరుగుతుంది. అంతేకాదు హొలీ సమయంలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, గులాబీ రంగులను ఎంచుకోవాలి. ఇది సంతోషాన్ని ఇస్తాయని విశ్వాసం. అంతేకాదు హోలీ ఆడుకునే సమయంలో ఉపయోగించే రంగులు రసాయనాలు కాకుండా సహజమైనవి ఎంపిక చేసుకోవాలి. హొలీ సంబరాలు ఇంటి ప్రాంగణంలో జరుపుకుంటే.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని విశ్వాసం.

హొలీ రోజున ఇలా చేయండి.. 

హోలీ పండుగ రోజున ఇంటి టెర్రస్ పై  హనుమాన్ జండాను కానీ, శ్రీ రాముడి జెండాను కానీ, వెంకటేశ్వర స్వామి జెండాలను కానీ ఏర్పాటు చేసుకోవడం శుభప్రదంగా వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. హొలీ సంబరాలను వాస్తు నియమాలను అనుసరిస్తూ.. సంప్రదాయంగా జరుపుకోవడం వలన ఆ ఇంట్లో ఏడాది పొడవునా ఆర్ధిక ఇబ్బందులు ఉండవని సంతోషంగా జీవిస్తారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

పాజిటివ్ ఎనర్జీ కోసం.. 

ఇంట్లోని దోషాలు తొలగించుకోవడానికి, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి హోలీ రోజున.. మొక్కలను నాటడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా మొక్కను పెంచడం వలన ఆ ఇంట్లో ఏడాది పొడవునా సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం. వ్యాపారాభివృద్ధికి, ధన లాభానికి హొలీ రోజున ఇంట్లో ప్రకృతి అందాన్ని ప్రతిభింబించే తూర్పున ఉదయించే సూర్యుడు చిత్రాన్ని పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..