Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friday Fasting: సంతోషిమాత వ్రతం పూజ విధానం.. ఉపవాస దీక్ష, ఉద్యాపన గురించి తెలుసుకుందాం..

సంతోషి దేవత దుర్గా దేవి  అవతారం అని విశ్వాసం. ఆనందం, సంతృప్తికి సంతోషిమాత అధిదేవతగా పరిగణిస్తారు. హిందూ సనాతన ధర్మంలో సంతోషిమాత పూజకు విశిష్ట స్థానం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాలలోని వారు శుక్రవారం సంతోషి మాతను పూజిస్తారు.

Friday Fasting: సంతోషిమాత వ్రతం పూజ విధానం.. ఉపవాస దీక్ష, ఉద్యాపన గురించి తెలుసుకుందాం..
Santhoshi Mata Pooja
Follow us
Surya Kala

|

Updated on: Feb 25, 2023 | 10:52 AM

వారంలోని ప్రతి రోజు హిందూ మతంలో ఏదొక దేవీదేవతలకు అంకితం చేయబడింది. వారంలోని ఒకొక్క రోజు ఒకొక్క ఒక నిర్దిష్ట దేవుడిని పూజిస్తారు. సోమవారం శివుడి, మంగళవారం హనుమంతుడికి, బుధవారం వినాయకుడికి, ఇలా ప్రతి రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఆ దేవుళ్లను అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవి, సంతోషిమాత, దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈరోజున అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈరోజు శుక్రవారం సంతోషిమాత పూజ విధానం.. ఉద్యాపన గురించి తెలుసుకుందాం..

సంతోషి దేవత దుర్గా దేవి  అవతారం అని విశ్వాసం. ఆనందం, సంతృప్తికి సంతోషిమాత అధిదేవతగా పరిగణిస్తారు. హిందూ సనాతన ధర్మంలో సంతోషిమాత పూజకు విశిష్ట స్థానం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాలలోని వారు శుక్రవారం సంతోషి మాతను పూజిస్తారు. ఉపవాసాన్ని పాటిస్తారు. సంతోషి మాత వ్రతాన్ని వరుసగా 16 శుక్రవారాలు చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతోషిమాత అనుగ్రహం పొందవచ్చు. ఇలా సంతోషిమాత మాత వ్రతం చేయడం వలన భక్తులకు సుఖ సంపదలను ఇస్తుందని.. కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు వెల్లువేరుస్తాయని నమ్మకం.  16 శుక్రవారాలు సంతోషిమాత వ్రతం, ఉపవాసం కుటుంబంలోని ప్రతి సభ్యుని శ్రేయస్సు కోసం ఉద్దేశించబడింది. ఈరోజు ఉపవాస దీక్ష గురించి తెలుసుకుందాం..

16 శుక్రవారం ఉపవాసం ఎలా పాటించాలంటే?

ఇవి కూడా చదవండి
  1. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి సంతోషి అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పూలతో అలంకరించాలి. అనంతరం ముందుగా పూజ కోసం కలశం ఏర్పాటు చేయాలి. అమ్మవారిని అందంగా అలంకరించండి.
  2. ముందుగా గణేశుడిని పూజించి, ఆపై సంతోషి మాతను పూజించండి.
  3. అమ్మవారి ముందు ఉంచిన కలశంలో నీరు నింపి, దానితో పాటు.. ఒక చిన్న గిన్నెలో, శనగలు, బెల్లం నైవేద్యంగా పెట్టండి.
  4. అనంతరం సంతోషి మాత కథను చదవండి. కథ పూర్తి అయిన తరవాత పూజలో కూర్చున్న భక్తులు సంతోషి మాతా కీ జై అంటూ పూజని ముగించండి.
  5. సంతోషి మాత కథ చదివిన తర్వాత.. హారతి ఇవ్వండి. అనంతరం సంతోషిమాత పూజలో పెట్టిన ప్రసాదం అందరికి పంచండి.
  6. పూజ అనంతరం కలశంలోని నీటిని బయట పారేయకండి. ఆ నీటిని ఇంట్లోని తులసి మొక్కకు పోయండి.
  7. ఇలా సంతోషి మాతను 16 శుక్రవారాలు పూజించండి. ఈ 16 శుక్రవారాలు ఉపవాసం ఆచరించండి. అంతేకాదు.. ఈ సమయంలో పులుపు వస్తువులను తినవద్దు.. ముట్టుకోవద్దు.

సంతోషి మాత వ్రత ఉద్యాపన: మీరు వరుసగా 16 శుక్రవారాలు ఉపవాసం పాటిస్తూ.. సంతోషి మాత పూజను ముగించిన తర్వాత.. ఉద్యాపనను చేయాలి. 16 శుక్రవారం ఎనిమిది మంది ఆడపిల్లలను అమ్మవారి స్వరూపంగా భావించి భోజనం పెట్టాలి. వ్రతాన్ని ముగించాలి. ఇలా సంతోషిమాత వ్రతం ఆచరించే సమయంలో పుల్లని రుచికి.. ఆహారానికి దూరంగా ఉండాలి. ఎవరికీ పుల్లని ఆహారాన్ని అందించకూడదు. రుచిలో పుల్లని ఆహారాన్ని తినకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)