IRCTC Tour: ద్వారక సహా గుజరాత్‌లోని ప్రముఖ ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా.. ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
సుందర సౌరాష్ట్ర టూర్ లో గుజరాత్ లోని ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు.. అహ్మదాబాద్, ద్వారకా, రాజ్‌కోట్, సోమనాథ్, వడోదరను సందర్శించొచ్చు. హైదరాబాద్ నుంచి రైలు ద్వారా ఈ టూర్ కొనసాగనుంది. ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాల్సి ఉంటుంది.
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. పిల్లలకు సెలవులు ఇవ్వడంతో.. సరదాగా వివిధ ప్రదేశాలకు వెళ్లాలని భావిస్తారు. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ చౌకైన ధరల్లో ప్యాకేజీ ప్రకటిస్తోంది. ఆధ్యాత్మిక ప్రదేశాలకు, అందమైన ప్రదేశాలను సందర్శించేందుకు వివిధ ప్యాకేజీలను అందిస్తోంది. తాజాగా హైదరాబాద్ నుంచి గుజరాత్ కు వెళ్లేందుకు సుందర్ సౌరాష్ట్ర అనే పేరుతో సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ 7 రాత్రులు, 8 పగళ్లు ఉండనుంది. మార్చి 3వ తేదీ నుంచి పర్యాటకులకు అందుబాటులో ఉండనుంది. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈరోజు “సుందర్ సౌరాష్ట్ర” ప్యాకేజీ వివరాల గురించి తెలుసుకుందాం..
సుందర సౌరాష్ట్ర టూర్ లో గుజరాత్ లోని ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు.. అహ్మదాబాద్, ద్వారకా, రాజ్‌కోట్, సోమనాథ్, వడోదరను సందర్శించొచ్చు. హైదరాబాద్ నుంచి రైలు ద్వారా ఈ టూర్ కొనసాగనుంది. ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు పోరుబందర్ ఎక్స్ ప్రెస్ బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ చేయాల్సి ఉంటుంది. మర్నాడు ఉదయం వడోదర స్టేషన్ కు చేరుకుంటారు.
అనంతరం వడోదర లో హోటల్ లో బస ఏర్పాటు చేసింది. ఆ రోజు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శిస్తారు. ఆ రోజు వడోదరలోనే బస చేస్తారు. మూడో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి.
లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ను సందర్శిస్తారు. అనంతరం ఆరోజు అహ్మాదాబాద్ కు వెళ్లాల్సి ఉంటుంది.. అక్కడ ఉన్న అక్షరదామం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ రోజు అహ్మాదాబాద్ లోనే బస చేయాల్సి ఉంటుంది. నాల్గో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి.. సబర్మతి ఆశ్రమానికి.. అక్కడ నుంచి రాజ్ కోట్ కు చేరుకుంటారు. అక్కడ హోటల్ కి వెళ్లి భోజనం చేసి.. వ్యాస్టన్ మ్యూజియాన్ని విజిట్ చేస్తారు. అనంతరం గాంధీ మ్యూజియం, స్వామి నారాయణ్ ఆలయాన్ని దర్శించుకుని రాత్రి రాజ్ కోట్ లోనే బస చేయాల్సి ఉంటుంది. ఐదోరోజు ద్వారకా చేరుకుంటారు. అక్కడ నుంచి జామ్ నగర్ కు చేరుకుని.. ద్వారక చేరుకుంటారు.. అక్కడ రాత్రి బస చేసి.. మర్నాడు ఉదయం అంటే ఆరో రోజు.. ద్వారకాదిశ్ ఆలయానికి వెళ్లి స్వామివారి దర్శించుకోవచ్చు.
ద్వారకాలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించి.. అక్కడ నుంచి చెక్ అవుట్ అయి సోమ్‌నాథ్ ఆలయ దర్శనం కోసం వెళ్లాల్సి ఉంటు ఉంటుంది. అనంతరం ఆరోజు సాయంతరం పోరుబందర్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్ పయనం అవ్వాల్సి ఉంటుంది. ఏడోరోజు అర్ధరాత్రి పోరుబందర్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ కు తిరిగి పయనం అవ్వాల్సి ఉంటుంది.
ఎనిమిదో రోజు ఉదయం 08.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. దీంతో సుందర్ సౌరాష్ట్ర టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
సుందర్ సౌరాష్ట్ర టికెట్ ధరల వివరాలు:
సింగిల్ షేరింగ్ కు రూ. 52,495 ధర
డబుల్ షేరింగ్ కు రూ. 29,540
ట్రిపుల్ షేరింగ్ కు రూ.22,860
3AC కోచ్ లతో పాటు.. 5 నుంచి 11 ఏళ్ల చిన్న పిల్లలకు కూడా వేర్వురు ధరలు ఉన్నాయి.
టికెట్ బుకింగ్ తో పాటు మరిన్ని వివరాల కోసం అధికారిక ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ సందర్శించొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..