Kaju Chicken Fry: సన్ డే స్పెషల్.. రెస్టారెంట్ స్టైల్ లో సింపుల్ అండ్ టేస్టీ కాజు చికెన్ ఫ్రై రెసిపీ

విదేశాల నుంచి మన దేశంలోని పల్లెటూర్లలో కూడా విభిన్న రకాల ఆహారాన్ని ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు రెస్టారెంట్ స్టైల్ లో సింపుల్ అండ్ టేస్టీ కాజు చికెన్ ఫ్రై రెసిపీ గురించి తెలుసుకుందాం.. 

Kaju Chicken Fry: సన్ డే స్పెషల్..  రెస్టారెంట్ స్టైల్ లో సింపుల్ అండ్ టేస్టీ కాజు చికెన్ ఫ్రై రెసిపీ
Kaju Chicken Fry
Follow us

|

Updated on: Feb 19, 2023 | 12:46 PM

మాంసాహార ప్రియుల్లో చేపలు, మాసం, సీఫుడ్ అంటే చాలా చాలా ఇష్టపడతారు. అయినప్పటికీ చికెన్ వెరీ వెరీ స్పెషల్.. కోడి మాసంతో చేసుకునే కూర, బిర్యానీ, వేపుడు, పకోడీ వంటి స్నాక్స్ ఏదైనా సరే నాన్ వెజ్ ప్రియులు అత్యంత ఇష్టంగా తింటారు. అయితే ఎక్కువమంది ఇంటిలో రెగ్యులర్ గా చేసే నాన్ వెజ్ వంటల కంటే.. రెస్టారెంట్ వైపు ఆసక్తిగా దృష్టి సారిస్తారు. అయితే ప్రస్తుతం కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వత తమకు నచ్చిన ఆహారపదార్ధాలు.. రెస్టారెంట్లలోనే కాదు.. తమ ఇంటిలో కూడా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. విదేశాల నుంచి మన దేశంలోని పల్లెటూర్లలో కూడా విభిన్న రకాల ఆహారాన్ని ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు రెస్టారెంట్ స్టైల్ లో సింపుల్ అండ్ టేస్టీ కాజు చికెన్ ఫ్రై రెసిపీ గురించి తెలుసుకుందాం..

కాజు చికెన్ ఫ్రై కావాల్సిన పదార్ధాలు:

చికెన్- బోన్ లెస్ అర కేజీ

ఇవి కూడా చదవండి

జీడిపప్పు – పావు కప్పు

అల్లంవెల్లుల్లి పేస్ట్- రెండు టేబుల్ స్పూన్లు

ఉల్లి తరుగు- ఒక కప్పు

పచ్చి మిర్చి – నిలువుగా చీల్చినవి 4

ధనియాల పొడి – రెండు టేబుల్ స్పూన్లు

పెరుగు- మూడు టేబుల్ స్పూన్లు

పసుపు – కొంచెం

కారం – రుచికి సరిపడా

ఉప్పు – రుచి సరిపడా

కొత్తిమీర తరుగు- కొంచెం

కరివేపాకు – మూడు రెమ్మలు

గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్

నిమ్మకాయ-

నూనె- వేయించడానికి సరిపడా

తయారీ విధానం: ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. అపుడు చికెన్ ముక్కలతో పాటు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసుకుని బాగా కలిపి.. కొంచెం నిమ్మరసం వేసుకుని కలిపి ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. అలా ఒక అరగంట వరకూ నానబెట్టుకోవాలి. అనంతరం స్టౌ వెలిగించి బాణలి పెట్టి.. నూనె వేసుకోవాలి. నూనె వేడి ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లులి పేస్ట్ వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకూ వేయించి.. అప్పుడు నానబెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకుని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ని స్విమ్ లో పెట్టుకుని దాదాపు 20 నిముషాలు ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత నీరు ఇంకి.. నూనె తేలేవరకూ వేయించుకోవాలి. అప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకుని కొంచెం సేపు వేడి చేయాలి. అనంతరం.. నూనెలో వేయించిన జీడిపప్పు వేసుకుని కొంచెం సేపు వేడి మీద ఉంచి స్టవ్ కట్టివేసుకోవాలి.. అంతే టేస్టీ టేస్టీ కాజు చికెన్ ఫ్రై రెడీ. తర్వాత నిమ్మ రసం పిండి, తరిగి ఉల్లిపాయలు వేసుకుని సర్వ్ చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వారేవా ఏం ఐడియా గురు! తనిఖీల్లో బయటపడ్డ ‘కట్టల’ పాములు
వారేవా ఏం ఐడియా గురు! తనిఖీల్లో బయటపడ్డ ‘కట్టల’ పాములు
ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?..
ఛత్రపతి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా ?..
డీమ్యాట్‌ ఖాతా నుంచి మరో ఖాతాకు షేర్లను ఎలా బదిలీ చేయాలి?
డీమ్యాట్‌ ఖాతా నుంచి మరో ఖాతాకు షేర్లను ఎలా బదిలీ చేయాలి?
దంతాల ఆరోగ్యంకోసం బ్రష్ చేయడానికి, బ్రష్‌కు నియమాలున్నాయని తెలుసా
దంతాల ఆరోగ్యంకోసం బ్రష్ చేయడానికి, బ్రష్‌కు నియమాలున్నాయని తెలుసా
బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్నమెట్రో..!లొల్లి మళ్లీ మొదలైంది
బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్నమెట్రో..!లొల్లి మళ్లీ మొదలైంది
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌