Health: డార్క్ చాక్లెట్ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. నిపుణుల అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు..

మనం తినే ఆహారపు అలవాట్లు మన మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సామర్థ్యాలను ఉపయోగించడంలో అవరోధాలు కలిగిస్తాయి. అంతే కాకుండా మానసిక సమస్యలకు గురి చేస్తాయి. మంచి ఆహారం తీసుకోవడం..

Health: డార్క్ చాక్లెట్ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. నిపుణుల అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు..
Dark Chocolate Health BenefitsImage Credit source: TV9 Telugu
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 19, 2023 | 12:57 PM

మనం తినే ఆహారపు అలవాట్లు మన మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సామర్థ్యాలను ఉపయోగించడంలో అవరోధాలు కలిగిస్తాయి. అంతే కాకుండా మానసిక సమస్యలకు గురి చేస్తాయి. మంచి ఆహారం తీసుకోవడం వల్ల మెదడు పనితీరు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని పోషకాలు కూడా అవసరం. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, మెదడు కణాలను పునరుద్ధరించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గిస్తాయి. వృద్ధాప్యం, అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడెజెనరేటివ్ రుగ్మతలతో ముడిపడి ఉంటాయి. రోజూ కొన్ని డార్క్ చాక్లెట్‌లు మెదడు ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు ఫ్లేవనాయిడ్‌లు కూడా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో మరింత సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్‌లో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడతాయి.

అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు కూడా మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఆకుపచ్చ కూరగాయల్లో మెదడు కణజాల పెరుగుదలను ప్రోత్సహించే సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం ఉంటుంది. బ్లూ బెర్రీస్ రుచికరమైనవి మాత్రమే కాదు. అవి మెదడుకు మంచివి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మెదడును కాపాడతాయి. అల్జీమర్స్ ప్రభావాలను తగ్గిస్తుంది. ఎక్కువ గింజలు తినడం మెదడుకు మంచిది. గుమ్మడికాయ గింజల్లో జింక్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడానికి చాలా ముఖ్యమైనది. వాల్‌నట్‌లు, బాదం, నూనెగింజలు, అవిసె గింజలు, చియా గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడే విటమిన్ ఇ అదికంగా కలిగి ఉండే ఆహారాలు.

ట్రౌట్, సాల్మన్, సార్డినెస్ వంటి చేపల్లో పెద్ద మొత్తంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. మెదడులో 60% కొవ్వు ఒమేగా 3లను కలిగి ఉండటమే కాకుండా.. మెదడు, నరాల కణాల ఉత్పత్తికి కూడా అవసరం అవుతాయి. గుడ్లలో బి విటమిన్లు, కోలిన్ అనే పోషకం పుష్కలంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..