AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exam Preparation Tips: పరీక్షల సమయంలో ఒత్తిడికి గురవుతున్నారా? అయితే డైట్‎లో ఈ ఫుడ్స్ చేర్చండి..!!

పదో తరగతి, ఇంటర్ పరీక్షలతోపాటు పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ కూడా వచ్చాయి. ఈ సమయంలో పిల్లలు చాలా కష్టపడి చదవుతుంటారు. మంచి మార్కులు సాధించాలన్న ఒత్తిడి వారిలో ఎక్కువగా ఉంటంది.

Exam Preparation Tips: పరీక్షల సమయంలో ఒత్తిడికి గురవుతున్నారా? అయితే డైట్‎లో ఈ ఫుడ్స్ చేర్చండి..!!
Mentally Healthy
Madhavi
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 19, 2023 | 7:45 PM

Share

పదో తరగతి, ఇంటర్ పరీక్షలతోపాటు పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ కూడా వచ్చాయి. ఈ సమయంలో పిల్లలు చాలా కష్టపడి చదవుతుంటారు. మంచి మార్కులు సాధించాలన్న ఒత్తిడి వారిలో ఎక్కువగా ఉంటుంది. కొంతమంది పిల్లలు చదువుకునే సమయంలో ఆందోళన, మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల భారీ అంచనాలే వీరి ఒత్తిడికి కారణం అని చెప్పొచ్చు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలన్న ఒత్తిడి పిల్లల్లో అధికంగా ఉంటుంది. దీంతో ఆందోళన, భయం మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు డిప్రెషన్ కు కూడా లోనవుతుంటారు.

పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురైతున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి వారిని బయటకు తీసుకురావడానికి ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చాలి. ఇవి ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. పరీక్షల సమయంలో పిల్లలకు అందించే ఆహారంలో మార్పులు చేయడం మంచిది. మీకు ఆశ్చర్యంగా అనిపించినా..ఆహారం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పరీక్ష ఒత్తిడిని అధిగమించడానికి అనుసరించాల్సిన కొన్ని ఆహార చిట్కాల గురించి తెలుసుకుందాం..

పరీక్ష ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ డైట్ చిట్కాలను అనుసరించండి:

1. కెఫిన్ తీసుకోవడం తగ్గించండి:

పరీక్షల సమయంలో, అధిక మొత్తంలో కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, టీ లేదా కోలాస్ తాగడం వల్ల మీ నిద్ర షెడ్యూల్‌కు ఆటంకం కలుగుతుంది. టీలు, కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ విశ్రాంతికి దూరంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. కెఫిన్ మిమ్మల్ని ఎక్కువ సమయం మెలకవగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు మీ మానసిక దృఢత్వాన్ని దెబ్బతీస్తుంది.

2. సమయానికి తినండి:

సమయానికి ఆహారం తీసుకోకపోవడం అనారోగ్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో టైం టు టైం భోజనం చేయాలి. పరీక్షా సమయాల్లో భోజనం చేయకపోవడం అనారోగ్యం, చికాకు, తక్కువ శక్తికి దారితీయవచ్చు. పరీక్షల సమయంలో షెడ్యూల్ పెట్టుకోండి. దాని ప్రకారం ఫాలో అవ్వండి. మీకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఎక్కువగా తినేలా చూసుకోండి.

3. హైడ్రేటెడ్ గా ఉండండి:

పుష్కలంగా నీరు తీసుకోవడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండండి. మీ స్టడీ డెస్క్‌పై, మీతో పాటు వాటర్ బాటిల్‌ను పెట్టుకోండి. నీటితోపాటు పుదీనా ఆకులు, లేదా నిమ్మకాయలతో తయారు చేసిన రసాయనాలను తీసుకోండి. ఈ సీజన్‎లో మీ శరీరం డీహ్రెడేషన్‎కు గురవుతుంది. కాబట్టి నీటితోపాటు జ్యూస్‎లు తీసుకోవడం చాలా కీలకం.

4. జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు తినండి:

జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అవసరం. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వాల్‌నట్‌లు, అవిసె గింజలు (అల్సీ), గుమ్మడికాయ గింజలు, నువ్వుల గింజలు (టిల్), సోయాబీన్ నూనె, కనోలా నూనె వంటివి తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో కూడిన సప్లిమెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పరీక్షల సమయంలో పిల్లలకు ఈ ఫుడ్స్ అందించాలి.

5. ఒత్తిడిని తగ్గించే ఆహారాలను తినండి:

పరీక్ష సమయంలో ఒత్తిడిని ఎదుర్కొనేందుకు విటమిన్ బి-కాంప్లెక్స్, విటమిన్ సి, అలాగే జింక్ వంటి ఖనిజాలతో సహా కొన్ని నీటిలో కరిగే విటమిన్లు మన శరీరానికి అవసరమవుతాయి. ఈ ఖనిజాలు అడ్రినల్ హార్మోన్ల ఉత్పత్తి సహాయపడతాయి. ఇవి మన శరీరం యొక్క ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు. బ్రౌన్ రైస్, బాదం, గుడ్లు, తాజా ఉత్పత్తులు, పండ్లు వీటిల్లో విటమిన్లన్నీ లభిస్తాయి. అందుకే వీటిని పరీక్షల సమయంలో తరచుగా తీసుకునే ప్రయత్నం చేయండి.

7. మెదడు ఆరోగ్యానికి మంచి ఆహారాలు తినండి:

ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా, విటమిన్లు A, C, E వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక ఒత్తిడి కారణంగా మెదడు కణాలకు హానిని తగ్గిస్తాయి. గుడ్లు, సాల్మన్ చేపలు, క్యారెట్లు, గుమ్మడికాయలు, ఆకు కూరలు, తాజా పండ్ల సహాయంతో ఈ అవసరాన్ని తీర్చవచ్చు. అవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, ఇమ్యూనిటీ లెవల్స్ ను పెంచడంలో సహాయపడతాయి. పరీక్షల సమయంలో మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తాయి. రాసేటప్పుడు మీరు అనారోగ్యానికి గురయ్యే సంభావ్యతను తగ్గిస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఇంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి