AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lung Cancer: ఊపిరితిత్తుల కేన్సర్‌ లక్షణాలివే.. మీలో ఇవి కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకండి..

ఎన్ని రోజులు అయినా సరే.. దగ్గు తగ్గకపోతే.. దాన్ని లంగ్ క్యాన్సర్‌గా అనుమానించాలి. అసలు దగ్గు తగ్గడం లేదంటే.. అది లంగ్ క్యాన్సర్..

Lung Cancer: ఊపిరితిత్తుల కేన్సర్‌ లక్షణాలివే.. మీలో ఇవి కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకండి..
Lung Cancer Symptoms
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 19, 2023 | 6:52 PM

Share

ప్రస్తుత కాలంలో మావవాళికి పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యలలో గుండెపోటు తర్వాత క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. మన భారత్‌లో అయితే అన్ని క్యాన్సర్ల కన్నా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని, అందులోనూ ఎక్కువగా పురుషులే ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని సర్వేలు, వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల లంగ్ క్యాన్సర్‌ను ఆరంభ దశలోనే గుర్తించాలని, దాని వల్ల చికిత్సను అందించడం సులభతరం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ లంగ్ క్యాన్సర్  వచ్చిందని, లేదా దాని లక్షణాలను ఎలా తెలుసుకోవాలి..? ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. దగ్గు తగ్గకపోవడం: సాధారణ దగ్గు అయితే 2 నుంచి 3 రోజుల్లో పోతుంది. లేదా మరికొద్ది రోజులు పడుతుంది. కానీ ఎన్ని రోజులు అయినా సరే.. దగ్గు తగ్గకపోతే.. దాన్ని లంగ్ క్యాన్సర్‌గా అనుమానించాలి. అసలు దగ్గు తగ్గడం లేదంటే.. అది లంగ్ క్యాన్సర్ అయి ఉండవచ్చు. ఈ లక్షణం ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని కలిసి చికిత్స తీసుకోవాలి. దగ్గు వచ్చినప్పుడు కొందరిలో శ్లేష్మం పడుతుంది. అయితే అందులో రక్తం ఉంటే దాన్ని కచ్చితంగా లంగ్ క్యాన్సర్‌గా అనుమానించాలి. వెంటనే చికిత్స తీసుకోవాలి.
  2. కష్టతరంగా మారిన ఊపిరి: లంగ్ క్యాన్సర్ ఉన్నవారికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టతరమవుతుంది. ముఖ్యంగా మెట్లు ఎక్కినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టతరంగా మారుతుంటే.. దాన్ని లంగ్ క్యాన్సర్‌గా అనుమానించి వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
  3. ఛాతిలో నొప్పి: గ్యాస్ సమస్య లేదా గుండె జబ్బులు ఉన్నవారిలో సహజంగానే ఛాతిలో నొప్పి వస్తుంటుంది. అయితే లంగ్ క్యాన్సర్ ఉన్నా కూడా ఛాతిలో నొప్పిగా ఉంటుంది. దాన్ని కూడా ఆ వ్యాధి ఉందని తెలిపేందుకు ఒక లక్షణంగా భావించాలి.
  4. స్వరంలో మార్పు: సడెన్‌గా బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, కంఠ స్వరంలో మార్పు, ఛాతిలో ఇన్‌ఫెక్షన్లు రావడం, చిన్నపనికే బాగా అలసిపోవడం, నీరసంగా ఉండడం.. వంటి లక్షణాలన్నీ లంగ్ క్యాన్సర్ ఉన్నవారిలో కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ఏవి ఉన్నాయని అనుకున్నా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..