Crop Loans: రైతన్నలకు శుభవార్త.. వడ్డీ లేకుండానే రూ.5 లక్షల రుణం..! చివరి గడువు, ఆర్హతల వివరాలివే..
ఇక మీదట రైతులకు రూ .5 లక్షల వరకు లోన్ ఇవ్వనున్నారు. వడ్డీ లేకుండానే ఈ రుణాలు పొందవచ్చు. ఏప్రిల్ 1 నుంచి రైతులు..
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందిస్తోంది. ఈ పథకాల వల్ల చాలా మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ స్కీమ్ తీసుకువచ్చింది. ఈ పథకం కింద అర్హత కలిగిన వారికి ఏటా రూ. 6 వేలు ఉచితంగా అందిస్తోంది. ఇక ఈ డబ్బులు రైతులకు ఒకేసారి కాకుండా మూడు విడతలుగా రూ. 2 వేల చొప్పున లభిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైతులకు రైతు భరోసా స్కీమ్‌ను అందిస్తోంది. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులు అందరికీ ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ వస్తోంది. మరోవైపు తెలంగాణ సర్కార్ కూడా అన్నదాతలకు రైతు బంధు స్కీమ్‌ను అమలు చేస్తోంది. భారత ప్రభుత్వం రైతులకు తక్కువ వడ్డీ రేటుకు లోన్ ఇస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఈ సదుపాయం కూడా ఇస్తోంది. ఈ స్కీమ్‌తో మీరు కేవలం 4 శాతం వడ్డీ రేటుకే లోన్‌ని పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు స్కీమ్స్‌ని అందిస్తున్నారు.
అయితే ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం కూడా రైతులకు ఓ గుడ్ న్యూస్ అందించింది. వడ్డీ రహిత రుణ పరిమితిని పెంచుతున్నట్లు చెప్పింది. ఇక మీదట రైతులకు రూ .5 లక్షల వరకు లోన్ ఇవ్వనున్నారు. వడ్డీ లేకుండానే ఈ రుణాలు పొందవచ్చు. ఏప్రిల్ 1 నుంచి రైతులు వడ్డీ భారం లేకుండా రూ. 5 లక్షల వరకు లోన్ వస్తుంది. బడ్జెట్ 2023- 24 లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. షార్ట్ టర్మ్ లోన్స్ పరిమితిని పెంచుతున్నట్లు కూడా ప్రకటించింది. రూ. 3 లక్షల నుంచి ఈ లోన్ పరిమితిని రూ. 5 లక్షలకు ఇక పెంచనున్నారు. లోన్ లిమిట్‌ని పెంచడం వలన 30 లక్షలకు పైగా రైతులకు ప్రయోజనం రానుంది. భూ సిరి అనే కొత్త పథకాన్ని తీసుకువస్తున్నట్లు ఆ ప్రభుత్వం వెల్లడించింది. కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఇందులో భాగంగా రైతులుక రూ. 10 వేల అదనపు సబ్సిడీ అందిస్తామని పేర్కొంది. దీని ద్వారా విత్తనాలు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొనుగోలుకు రైతులకు బెనిఫిట్ ఉంటుంది. ఇలా రూ.5 లక్షల వరకు వడ్డీ రహిత, సబ్సిడీ ప్రయోజనాలు మన రైతులకు కూడా అందుబాటులోకి వస్తే బాగుంటుందని తెలుగు రాష్ట్రాలలోని కొందరు యువకులు కోరుకుంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..