Pears Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు బేరి పండ్లను అసలు తినకూడదు.. తింటే అంతే సంగతి..!
పండ్లలోని పోషకాలు మన శరీరానికి అందడం వల్ల మనకు ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే ఈ పండ్లలోని పోషకాలు కొన్ని రకాల..
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నిత్యం పండ్లు, కూరగాయలను తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకు వాటిల్లోని పోషకాలే ప్రధాన కారణమని మనలో చాలా మందికి తెలుసు. పండ్లలోని పోషకాలు మన శరీరానికి అందడం వల్ల మనకు ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే ఈ పండ్లలోని పోషకాలు కొన్ని రకాల సమస్యలు ఉన్నవారిపై ప్రతికూల ఫలితాలను చూపిస్తాయి. అలాంటి పోషకాలను కలిగిన పండ్లలో పియర్స్ కూడా ఒకటి. చూడటానికి జామ కాయలా కనిపంచే ఈ పండును తెలుగులో బేరి ప్రూట్ అంటారు. తినడానికి ఎంతో రుచికరంగా ఉండే ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ పండులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే ముందుగా పేర్కొన్నట్లుగా ఈ ప్రూట్ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఎవరెవరు పియర్స్ పండ్లను తినకూడదంటే..
- అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు ఈ బేరి పండ్లను తినకుండా ఉండటం మంచిది. ఎందుకంటే దీనిని తిన్న తర్వాత మీ జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అజీర్తి సమస్యలు ఉన్నవారు ఈ ఫ్రూట్‌ను మార్నింగ్, నైట్ తినవద్దు. ఒక వేళ దానిని తీసుకున్నట్లయితే మీరు గ్యాస్, తిమ్మిరి, అతిసారం వంటి వ్యాధుల బారిన పడతారు.
- పియర్స్‌ను తినడం వల్ల మన శరీరం కూల్ అవుతుంది. అందుకే జలుబు, దగ్గు ఉన్నవారు వీటికి దూరంగా ఉంటే మంచిది.
- బేరి పండులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి, ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఈ పండును ఎక్కువగా తీసుకున్నట్లయితే మీరు వైట్ పెరిగే అవకాశం ఉంది.
- హై బీపీ ఉన్నవారు ఈ పియర్స్‌ను తక్కువ మెుత్తంలో తీసుకోవాలి. మీరు దీనిని అధికంగా తీసుకున్నట్లయితే లాభం కంటే ఎక్కువగా నష్టమే ఉంటుంది. అంతేకాకుండా మూర్ఛ, మైకం, శ్వాస సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..