- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS 2nd Test Virat Kohli become 2nd cricketer for India to complete 25000 international runs and joins Sachin Tendulkar club
Virat Kohli: క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ.. ఆ లిస్ట్ టాప్‌లోకి కూడా ..
ఢిల్లీ టెస్టులో విరాట్ కోహ్లీ అంతర్జాతీయం క్రికెట్‌లో అరుదైన ఘనతను సాధించాడు. కింగ్ కోహ్లీ 25,000 పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. అంతేకాక క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్‌మ్యాన్‌గా, రెండో భారతీయుడిగా నిలిచాడు.
Updated on: Feb 19, 2023 | 3:11 PM

Virat Kohli; Sachin Tendulkar

Virat Kohli

ఇక భారత్ తరఫున కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను సాధించాడు. అయితే సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 25000 చేయడానికి 577 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.

లియాన్ ఇచ్చిన క్యాచ్ పట్టడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ చేరాడు. విశేషమేమిటంటే.. టీమిండియా తరఫున రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఇలా 300 ఇంటర్నేషనల్ క్యాచ్‌లు పట్టిన ఘనత సాధించాడు.

కోహ్లి కంటే ముందు సచిన్(577 ఇన్నింగ్స్), రికీ పాంటింగ్(588 ఇన్నింగ్స్), జాక్వెస్ కలిస్(594 ఇన్నింగ్స్), కుమార సంగక్కర(608 ఇన్నింగ్స్),మహేల జయవర్ధనే(701 ఇన్నింగ్స్) కూడా ఈ ఘనత సాధించారు.

మరోవైపు ఈ ఘనతను వేగంగా సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ(548 ఇన్నింగ్స్) ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉండగా.. సచిన్(577) రెండో స్థానంలో, రిక్కీ పాంటింగ్(588) మూడో స్థానంలో ఉన్నారు.

ఫలితంగా 25000 పరుగులు సాధించిన క్రికెటర్ల ఎలైట్ గ్రూప్‌లో కూడా కోహ్లీ ప్రథమ స్థానంలో ఉన్నట్లయింది.





























