- Telugu News Sports News Cricket news Women s t20 world cup 2023 harmanpreet kaur played 149 matches in history of t20i and Rohit Sharma was also left behind
IND W vs ENG W: టీ20ఐ చరిత్రలో హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డ్.. రోహిత్ శర్మను వెనక్కునెట్టిన భారత మహిళల సారథి..
Women's T20 World Cup 2023: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు మూడో మ్యాచ్ ఆడింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్ ద్వారా హర్మన్‌ప్రీత్ కౌర్ అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన రికార్డు సృష్టించింది.
Updated on: Feb 19, 2023 | 5:40 AM

Harmanpreet Kaur's Record: మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో భారత జట్టు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచింది. కాగా, ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

హర్మన్‌ప్రీత్ కౌర్ తన కెరీర్‌లో 149వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ ద్వారా క్రికెట్ ప్రపంచంలో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ నిలిచింది. ఈ విషయంలో రోహిత్ శర్మను కూడా వెనక్కునెట్టింది.

భారత పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 148 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. అయితే హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ రికార్డును బీట్ చేసింది. హర్మన్‌ప్రీత్ తన కెరీర్‌లో మొత్తం 149 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ జూన్ 2009లో తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. రోహిత్ శర్మ సెప్టెంబర్ 2007లో తన మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.

హర్మన్‌ప్రీత్ కౌర్ - 149 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 134 ఇన్నింగ్స్‌లలో, హర్మన్‌ప్రీత్ కౌర్ 28.19 సగటుతో 2993 పరుగులు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 1 సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు సాధించింది. బ్యాటింగ్‌లో ఆమె అత్యధిక స్కోరు 103 పరుగులు. బౌలింగ్‌లో 32 వికెట్లు తీసింది.

రోహిత్ శర్మ- సెప్టెంబర్ 2007లో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం 148 టీ20ఐ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలోని 140 ఇన్నింగ్స్‌లలో, అతను 31.32 సగటు, 139.24 స్ట్రైక్ రేట్‌తో 3853 పరుగులు చేసింది. ఇందులో అతను మొత్తం 4 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో రోహిత్ అత్యధిక స్కోరు 118 పరుగులు.




