- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS 2nd Test For Team India Players Delhi Test win against Aussies so special here is why check here for more details
IND vs AUS 2nd Test: ఢిల్లీ టెస్టు విజయం భారత ప్లేయర్లకు చాలా ప్రత్యేకం.. ఈ మ్యాచ్ పూర్తి విశేషాలివే..
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి ఉంది టీమిండియా. ఫలితంగా ట్రోఫీ కూడా మన దగ్గరే ఉంటుంది.
Updated on: Feb 19, 2023 | 7:33 PM

ఢిల్లీ వేదికగా జరిగిన రెండో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఇది సాధారణ విజయమని చెప్పుకోవాటానికి లేదు. ఎందుకంటే మన క్రికెటర్లకు, భారత జట్టుకు ఈ టెస్టు ఎన్నో రకాలుగా ప్రత్యేకమైనది. అదేలా అనేది మఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli; Sachin Tendulkar

బెస్ట్ బౌలింగ్: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా తన టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన జడేజా.. ఈ టెస్టులో 110 పరుగులిచ్చి పది వికెట్లు పడగొట్టాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకొన్నాడు.

విన్నింగ్ షాట్: తన వందో టెస్టు మ్యాచ్ ఆడిన ఛెతేశ్వర్ పుజారా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 31పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ విజయం కోసం పుజారా విన్నింగ్ షాట్.. అది కూడా బౌండరీ కొట్టడం ఇక్కడ ప్రత్యేకత. ఇలా వందో టెస్టులో విన్నింగ్ షాట్‌ను బౌండరీగా మలిచిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా 2006 ఇదే విధంగా సిడ్నీ వేదికగా బౌండరీతో తన జట్టును గెలిపించాడు.

ఎక్కువ విజయాలు: ఢిల్లీ వేదికగా 1993 నుంచి 2023 వరకు జరిగిన టెస్టుల్లో భారత్‌కు ఓటమి అనేదే లేదు. ఈ క్రమంలో భారత్ ఖాతాలో ఏకంగా పదమూడు విజయాలున్నాయి. 1948-65 మధ్య కాలంలో ముంబై బ్రబౌర్నె స్టేడియంలో, 1997-2022 మధ్యలో మొహాలీలోనూ పదమూడేసి విజయాలతో భారత్ దూసుకుపోయింది.




