AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scented Candles: ఈ కొవ్వొత్తులతో సువాసనలే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా..! తెలుసుకునేందుకు ఓ లుక్కేయండి..

ఇంటికి అలంకరణగా ఉపయోగించే ఈ సెంటెడ్ క్యాండిల్స్ ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. రోజంతా ఎన్నో పనులతో అలసిపోయి ఇంటికి వచ్చే వారికి ఈ..

Scented Candles: ఈ కొవ్వొత్తులతో సువాసనలే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా..! తెలుసుకునేందుకు ఓ లుక్కేయండి..
Scented Candles
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 19, 2023 | 6:32 PM

Share

అభివృద్ధి చెందిన టెక్నాలజీ, అందుబాటులో ఉన్న ఎలక్ట్రిసిటీ కారణంగా ప్రస్తుత కాలంలో క్యాండిల్స్ వాడే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఎలక్ట్రిసిటీ లేదా కరెండ్ పోయినప్పుడు కూడా జనరేటర్, ఇన్వర్టర్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు వెలుగు కోసం ఉపయోగించిన కొవ్వొత్తులను ప్రస్తుత కాలంలో ప్రత్యేక సందర్భాలలో, ఇంటికి అలకంరణ కోసం మాత్రమే వాడుతున్నారు. అయితే కొవ్వొత్తులలో అనేక రకాలు ఉన్నాయని మీకు తెలుసా..? అలాగే కొవ్వొత్తులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఎప్పుడైనా ఊహించారా..? అవును. కొవ్వొత్తుల ద్వారా కూడా ఆరోగ్యానికి మంచి జరుగుతుందని నిపుణులు, వారి అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుత కాలంలో సువాసనలను వెదజల్లే సెంటెడ్ క్యాండిల్స్ మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఈ సెంటెడ్ క్యాండిల్స్ నుంచి వచ్చే సువాసనలు మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు.

ఇంటికి అలంకరణగా ఉపయోగించే ఈ సెంటెడ్ క్యాండిల్స్ ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. రోజంతా ఎన్నో పనులతో అలసిపోయి ఇంటికి వచ్చే వారికి ఈ సెంటెడ్ క్యాండిల్స్ మనశ్శాంతితో పాటు ఆనందాన్నిస్తాయని నిపుణులు చెప్తున్నారు. మరి ఈ సెంటెడ్‌ క్యాండిల్స్‌తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మెరుగైన నిద్ర: మనలో జీవ గడియారం అని పిలిచే ఒక నిద్రా చక్రం ఉంటుంది. అంటే రోజూ ఏ సమయానికి మనం నిద్రపోతామో, మరుసటి రోజు అదే టైంకి నిద్ర వచ్చేలా చేయడమే దీని పని. ఇది ఒక సిర్కాడియన్ రిథమ్. నిద్రపోవడానికి ముందు సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోవడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. గదిలో తక్కువ వెలుగునిచ్చే నీలి బల్బుల కన్నా, ఇలా క్యాండిల్స్ వెలిగించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. నిద్ర హాయిగా పడుతుంది. ముఖ్యంగా పెద్ద వయసులో వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మెరుగైన జ్ఞాపకశక్తి: మెదడు చేసే అత్యంత ముఖ్యమైన విధుల్లో ఒకటి జ్ఞాపకశక్తి. మెదడుకు కావాల్సిన ప్రశాంతత, సమతుల ఆహారం దొరకకపోతే దాని జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంది. జ్ఞాపకశక్తి, భావోద్వేగాలు అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. రోజూ నిద్రపోయే ముందు సెంటెడ్ క్యాండిల్ వెలిగించుకుంటే సువాసన శాస్త్రం ప్రకారం జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

ప్రశాంతత: ఒకరి మానసిక స్థితి, ఉత్పాదకత స్థాయి, ఒత్తిడిపై వాసన ప్రభావం గణనీయంగా ఉంటుంది. ప్రత్యేకించి సువాసనగల కొవ్వొత్తులు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఆందోళనను తగ్గిస్తాయి.

ఒత్తిడి నివారిణి: కొన్ని రకాల కొవ్వొత్తుల సువాసనలు శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అదే సమయంలో డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాలు స్రవించేందుకు కారణంగా నిలుస్తుంది. ఇవి శక్తిని పెంచి, ఉత్పాదక మనస్తత్వాన్ని అలవర్చుకోవడంలో సహాయపడుతుంది.

ఆధ్యాత్మిక ఆరోగ్యం: క్రమం తప్పకుండా మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ సాధన చేసేవారికి సెంటెడ్‌ క్యాండిల్స్ సన్నిహిత స్నేహితులుగా ఉంటాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జాస్మిన్, లావెండర్, పిప్పరమింట్ వంటి రకాలు ఆహ్లాదకరమైన వాసనలు అందిస్తాయి. ఇవి స్వీయ-విజువలైజేషన్ వ్యాయామాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే యోగాభ్యాసం చేయాలన్న కోరికను పెంచుతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..