Summer Season: వేసవిలో లడఖ్‌లో పర్యటించాలనుకుంటున్నారా.. చౌకైన ధరలో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు మీకోసం
హిమగిరుల సోయగాలను, మంచు తెరల మధ్య లడఖ్ అందాలను ఆస్వాదించాలనే పర్యాటకుల కోసం చౌకైన ధరలో ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ మొత్తం 7 పగళ్లు , 6 రాత్రుళ్లు సాగనుంది. ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
వేసవిలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్న ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్.. కేంద్ర పాలిత ప్రాంతమైన అందాల లడఖ్ ను చూడాలనుకునే తెలుగువారికి ఐఆర్‌సీటీసీ టూరిజం శుభవార్త చెప్పింది. భాగ్యనగరం నుంచి లేహ్ లడఖ్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హిమగిరుల సోయగాలను, మంచు తెరల మధ్య లడఖ్ అందాలను ఆస్వాదించాలనే పర్యాటకుల కోసం చౌకైన ధరలో ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ మొత్తం 7 పగళ్లు , 6 రాత్రుళ్లు సాగనుంది. ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు లేహ్-లడఖ్ సందర్శిస్తారు. మీరు వేసవి సీజన్‌లో లేహ్-లడఖ్‌లోని అందాలను సందర్శించాలనుకుంటే.. IRCTC టూర్ ప్యాకేజీ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్యాకేజీకి లేహ్ విత్ టర్టుక్ ఎక్స్ హైదరాబాద్ అని పేరు పెట్టారు.
ఐఆర్‌సీటీసీ టూరిజం లేహ్ లడఖ్ టూర్ ప్యాకేజీ మొదటి రోజు ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. 7 పగలు, 6 రాత్రుల ఈ టూర్ ప్యాకేజీ 4 మే 2023న ప్రారంభమవుతుంది. ప్యాకేజీలో.. హైదరాబాద్ నుండి లేహ్‌కు విమానంలో తీసుకుని వెళ్లారు. టూర్ పూర్తి అయిన తరువాత, తిరిగి లేహ్ నుండి హైదరాబాద్‌కు విమానంలో తిరిగి తీసుకుని వస్తారు. ఈ ప్యాకేజీలో విమాన ఛార్జీలు, బస్సు, హోటల్, ఆహారం, గైడ్, బీమా తదితర సౌకర్యాలు ఉన్నాయి.
టూర్ ప్యాకేజీ వివరాలు: ఐఆర్‌సీటీసీ టూరిజం లేహ్ లడఖ్ టూర్ ప్యాకేజీ ధర వివరాల్లోకి వెళ్తే..
Fall under the spell of the mesmerizing views of Leh with IRCTC’s Leh with Turtuk ex Hyderabad, 6N/7D tour package. Book now on https://t.co/UuLpJtndN1@AmritMahotsav @incredibleindia @tourismgoi #AzadiKiRail #bharatparv23 pic.twitter.com/XxbiZh9b4T
— IRCTC (@IRCTCofficial) February 23, 2023
కంఫర్ట్ క్లాస్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఒక్కో వ్యక్తి ధర రూ. 47,830 చెల్లించాలి. డబుల్ ఆక్యుపెన్సీకి ఒక్కో వ్యక్తికి రూ. 48,560, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.54,500లు చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ.45,575, బెడ్ లేకుండా రూ.41,750 చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..