Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే తినే ఆహారంలో చేపని చేర్చుకోండి.. ఏ చేప మంచిదంటే..

శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలను అందించేందుకు, బరువు తగ్గడానికి చేపలు బెస్ట్ అని అధ్యయనాలు కనుగొన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) మంచి ఆరోగ్యం కోసం ప్రతి వారం రెండు నుండి మూడు సేర్విన్గ్స్ చేపలను తినాలని సిఫార్సు చేస్తోంది.

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే తినే ఆహారంలో చేపని చేర్చుకోండి.. ఏ చేప మంచిదంటే..
Fish For Weight Loss
Follow us
Surya Kala

|

Updated on: Feb 22, 2023 | 3:02 PM

నాన్ వెజ్ ప్రియులకు మాసం, చేపలు, రొయ్యలు వంటి అనేక రకాలున్నాయి. చేపల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. తక్కువ కొవ్వు పదార్ధాలను కలిగి ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి చేపలు మరింత ప్రయోజనకరం. బరువు తగ్గించే ఆహారంలో చేపలను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. చేపలను తినే ఆహారంలో చేర్చుకోవడం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. చేపలు తినడం వల్ల మీరు బరువు తగ్గగలరా?  బరువు తగ్గడానికి చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలను అందించేందుకు, బరువు తగ్గడానికి చేపలు బెస్ట్ అని అధ్యయనాలు కనుగొన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) మంచి ఆరోగ్యం కోసం ప్రతి వారం రెండు నుండి మూడు సేర్విన్గ్స్ చేపలను తినాలని సిఫార్సు చేస్తోంది. అంతేకాదు.. అమెరికన్ల కోసం ఆహార మార్గదర్శకాలు రిలీజ్ చేస్తూ..  వారానికి కనీసం 8 ఔన్సుల చేపలను తీసుకోవాలని సూచించింది. అయితే పిల్లలకు తక్కువ సిఫార్సు చేసింది. “అద్భుతమైన నాణ్యమైన ప్రోటీన్, ఉత్తమ నాణ్యత గల కొవ్వులతో అరుదైన కలయిక చేప. ఇది బరువు తగ్గడానికి ఒక అద్భుతమైన ఆహారం” అని ముంబైకి చెందిన పోషకాహార నిపుణుడు, జీవనశైలి విద్యావేత్త కరిష్మా చావ్లా చెప్పారు.

చేపలు తినడం వల్ల కొన్ని అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. 

ఇవి కూడా చదవండి

తక్కువ కేలరీలు: ప్రాసెస్ చేసిన మాంసం లేదా రెడ్ మీట్ వలె కాకుండా, చేపలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే చేపలను ‘లీన్ ప్రోటీన్’ అని పిలుస్తారు. ఇది తక్కువ కేలరీలు.. తక్కువ కొవ్వు కలిగి ఉంటాయి. ప్రోటీన్ అధికం.

ప్రోటీన్ కు మంచి మూలం: చేపలలో మంచి నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ కాలం ఆకలి కలగకుండా సంతృప్తిగా ఉంచుతుంది. ఆకలిని దూరం చేస్తుంది.

సమృద్ధిగా ఒమేగా-3: ఆరోగ్యకరమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చేపలో అధికంగా ఉంటాయి. ఇవి బరువుని అదుపులో ఉంచడానికి..  ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడానికి సహాయపడతాయి.

ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది: చేపలు జీవక్రియకు బూస్ట్ అందించడం ద్వారా శరీరంలో కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) ప్రకారం చేపలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

ఏ చేప మంచిదంటే.. 

సాధారణంగా సాల్మన్, రవాస్, ట్రౌట్, ట్యూనా, సార్డినెస్, ఆంకోవీస్, మాకేరెల్ వంటి చేపలు ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. ఆంకోవీ, క్లామ్, క్యాట్ ఫిష్, హెర్రింగ్, ఓస్టెర్, రొయ్యలు, ట్రౌట్ వంటి ఎంపికలతో సహా ఆరోగ్యానికి అద్భుతమైన చేపల్లో కొన్ని ఉత్తమ ఎంపికలని  FDA సూచిస్తుంది. పాదరసం ఎక్కువగా ఉన్న చేపలను ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు నివారించవచ్చని పేర్కొంది. “గర్భిణీ స్త్రీ లేదా తల్లిపాలు ఇచ్చే వారి ఆహారంలో పాదరసం పరిమితం చేయడం ముఖ్యం కనుక..పాదరసం ఉన్న చేపలను వీరు దూరంగా ఉంచాలని సూచించింది.

పోషకాహార నిపుణుల ప్రకారం..  నంబర్ వన్ ఆరోగ్యకరమైన చేప మీ ఆరోగ్య అవసరాలపై ఆధారపడి ఉంటుంది. సాల్మన్ చేప  సాధారణంగా విటమిన్లు,  ఖనిజాలతో పాటు మంచి కొవ్వు పదార్ధం కలిగి ఉంటుంది.

“కొవ్వు చేపలు తెల్ల చేపల కంటే మంచి నాణ్యత గల కొవ్వును కలిగి ఉంటాయి. ఎందుకంటే అవి రెండు కణజాలాల్లో కొవ్వు లేదా నూనెను కలిగి ఉంటాయి. గట్ చుట్టూ ఉన్న బొడ్డు కుహరంలో ఉంటాయి. కనుక సాల్మన్ చేప  బరువు తగ్గడానికిఉత్తమ చేప అయింది.  నూనెలో క్యాన్ చేసిన ట్యూనా కంటే ఉప్పు నీటిలో ఉడకబెట్టిన ట్యూనా ఉత్తమమని, అది ఎక్కువ కొవ్వు పదార్థాన్ని కలిగి ఉంటుందని పోషకాహార నిపుణులు కరిష్మా చావ్లా అన్నారు.

బరువు తగ్గడానికి ఏ భారతీయ చేప మంచిది?

ఇండియన్ హెర్రింగ్ ఫిష్ (హిల్సా) చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ చేపను బరువు తగ్గించే ఆహారంలో చేర్చవచ్చు. అంతేకాదు మాకేరెల్ (బాంగ్డా), బటర్ ఫిష్ (పాంఫ్రెట్), క్యాట్ ఫిష్ (సింగరా) కొన్ని స్థానిక భారతీయ చేపలు చాలా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడతాయి. రవా, కట్లా వంటి ఇతర భారతీయ చేపలు కూడా బరువు తగ్గించే ఆహారంలో అద్భుతమైనవి.

అయితే ఆహారంలో ఏదైనా పెద్ద మార్పులు చేసే ముందు పోషకాహార నిపుణుడు లేదా వైద్యుడిని సంప్రదించాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. చేపలను తినేటప్పుడు డీప్ ఫ్రై చేయడం వంటి పద్ధతులను ఉపయోగించవద్దు ఎందుకంటే ఇది మీ బరువు తగ్గించే లక్ష్యాలను నిర్వీర్యం చేస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)