AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vulvodynia: ఆ ప్రాంతంలో నొప్పి వేధిస్తోందా? ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి..

అదే సమయంలో వల్వోడినియా అనేది కూడా మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి. కానీ దీనిని పెద్ద గా ఎవరూ గుర్తించలేరు. ఒకవేళ గుర్తించినా ఎవరికీ చెప్పుకోలేక వారిలో వారే ఆ బాధను అనుభవిస్తూ ఉంటారు.

Vulvodynia: ఆ ప్రాంతంలో నొప్పి వేధిస్తోందా? ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి..
Vulvodynia Pain
Madhu
|

Updated on: Feb 22, 2023 | 3:00 PM

Share

మహిళలు పీరియడ్స్ సమయంలో చాలా నొప్పి, బాధను అనుభవిస్తారు. చాలా మంది ఆ బాధను బయటకు చెప్పుకోలేరు. అయితే అదే సమయంలో వల్వోడినియా అనేది కూడా మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి. కానీ దీనిని పెద్ద గా ఎవరూ గుర్తించలేరు. ఒకవేళ గుర్తించినా ఎవరికీ చెప్పుకోలేక వారిలో వారే ఆ బాధను అనుభవిస్తూ ఉంటారు. నిమ్మళంగా ఒక చోట కూర్చుండి పోయి ఇబ్బందులు పడతారు. వల్వోడినియా అంటే యోని లేదా యోని బయటి జననేంద్రియా భాగాలలో వచ్చే తీవ్ర నొప్పి. ఇది సాధారణంగా అనేక నెలల పాటు ఎటువంటి కారణం లేకుండానే కొనసాగుతుంటుంది. ఈ నొప్పి వచ్చినప్పుడు మహిళల్లో అసహనం పెరిగిపోతుంది. వారు ఒకరకంగా మనశ్శాంతిని కోల్పోతారు.

రెండు రకాలు..

ఈ వల్వోడినియా రెండు రకాలుగా ఉంటుంది. సాధారణ నొప్పి, అలాగే బాహ్య జననేంద్రియ భాగాల చుట్టూ వ్యాపించే నొప్పి. దీని కారణంగా సెక్సువల్ గా కలవలేరు. ఏదో చెప్పలేని ఇబ్బంది అనుభవిస్తారు. ఫలితంగా వారు రోజువారీ పనులు కూడా చేసుకోలేరు.

కారణాలు ఇవి..

మహిళలు చాలా బిగుతుగా జీన్ ప్యాంట్లు వేసుకొని గంటల తరబడి ఒకచోట కూర్చోవడం ప్రధాన కారణమన్నారు. అలాగే రసాయనాలతో నిండిన ఉత్పత్తులను వాడటం, యోని సంబంధింత ఇన్ఫెక్షన్ల చరిత్ర, హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారికి ఇది వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

లక్షణాలు ఇవి..

ఈ నొప్పి వచ్చినప్పుడు యోని చుట్టూ చికాకు ఫీలింగ్ కలుగుతుంది. యోని వద్ద నొప్పి ఉంటుంది. మంట, పుండ్లు ఏర్పడతాయి. దురద ఉంటుంది. సెక్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ లక్షణాలు మీరు అనుభవిస్తే వెంటనే వైద్యులను సంప్రందించాలి. వారు కొన్ని పరీక్షలు చేసి, పూర్వ చరిత్రను తెలుసుకొని వ్యాధి నిర్ధారణ చేస్తారు.

చికిత్స ఇలా..

వల్వోడినియా నిర్ధారణ అయిన తర్వాత చికిత్సను వైద్యులు ప్రారంభిస్తారు. వారు సూచించిన విధంగా మందులు వాడాలి. అలాగే నొప్పి అనుభవిస్తున్న ప్రాంతంలో పూసేందుకు కొన్ని క్రీమ్ లను వైద్యులు సూచిస్తారు. కొంతమంది మహిళల్లో రుతుక్రమం ఆగిపోయిన వారిలో ఈ సమస్య వస్తే ఈస్ట్రోజెన్ హార్మోన్ సప్లిమెంట్లను ఇస్తారు.. అలాగే ఫిజియోథెరపీ, మసాజ్, ధ్యానం, యోగా, ఒత్తిడిని తగ్గించడానికి శ్వాస వ్యాయామాలు కూడా చేయడం ద్వారా వల్వోడినియా నుంచి విముక్తి పొందవచ్చు. దీనికి సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ఈ పరిస్థితి ఆందోళన, నిరాశకు దారితీస్తుంది.

కొన్ని చిట్కాలు ఇవి..

మహిళల మానసిక ఆరోగ్యంతో ముడిపడిన ఈ వల్వోడినియా నొప్పిని రాకుండా చూసుకోవాలి. అందుకోసం నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవి ఏంటంటే బిగుతైన ప్యాంట్లు ధరించకూడదు. అలాగే కాటన్ లోదుస్తులను వేసుకోవద్దు, వల్వాను కడగడానికి రసాయనాలు కలిగిన సబ్బులను ఉపయోగించవద్దు, సెక్స్ సమయంలో లూబ్రికెంట్లను ఉపయోగించకూడదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..