AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tourist Places : రాబోయే వేసవిలో విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్లేసెస్ మీ కోసమే..

సాధారణంగా వేసవి కాలం అంటేనే పిల్లలకు ఎక్కువ రోజులు సెలవులు వస్తాయి. కాబట్టి కచ్చితంగా దూరప్రాంతాలకు విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇప్పటి నుంచి బుక్ చేసుకుంటేనే కానీ ఆయా ప్రాంతాలకు ట్రైన్, బస్, హోటల్స్ వంటి అన్ని సదుపాయాలు దొరకవు. వేసవి అంటే ఎండలు విపరీతంగా ఉంటాయి. కాబట్టి ఏదైనా చల్లటి ప్రదేశాలతో పాటు కొండ ప్రాంతాల్లో విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇండియాలో ఉండే బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాల గురించి తెలుసుకుందాం.

Nikhil
|

Updated on: Feb 25, 2023 | 10:40 AM

Share
ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా ఓ సుప్రసిద్ధ హిల్ స్టేషన్. వేసవిలో చల్లటి ప్రదేశంలో సేదతీరుదామనే వారికి ఇదో బెస్ట్ ప్లేస్‌లా ఉంటుంది.

1 / 7
హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండే మరో హిల్ స్టేషన్ మనాలి. మంచు అందాలను వీక్షించాలనుకునేవారు కచ్చితంగా మనాలిని చూడాల్సిందే.

2 / 7
పశ్చిమ బెంగాల్‌ల్లో ఉండే డార్జిలింగ్ కూడా అద్భుతమైన కొండ ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన తేయాకు తోటలు, హిమాలయాల సోయగాలు ఇక్కడ నుంచి వీక్షించవచ్చు.

3 / 7
సౌత్ ఇండియాలో ఉండే సుప్రసిద్ధ కొండ ప్రాంతం ఊటీ. పచ్చటి ప్రకృతి రమణీయతతో వీక్షించాలనుకునే వారికి ఇది అనువైన ప్రాంతం.

4 / 7
కేరళలో చాలా ప్రసిద్ధి చెందిన కొండ ప్రాంతం మున్నార్. ఇక్కడి రావడానికి ప్రకృతి ప్రేమికులు చాలా ఇష్టపడతారు. ఇక్కడి పచ్చదనం ఎంజాయ్ చేయడంతో పాటు తేయాకు తోటల అందాన్ని వీక్షించవచ్చు.

5 / 7
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన అందమైన కొండ ప్రాంతం నైనాటిల్. ఇక్కడ ఎత్తయిన కొండలతో పాటు, అద్భుతమైన దేవాలయాలు మనకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. అలాగే ఇక్కడ ఉండే సరస్సులో బోటింగ్‌ను ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.

6 / 7
ఉత్తరాఖండ్‌లోనే ఉండే మరో కొండ ప్రాంతం ముస్సోరీ. దట్టమైన అడవులతో సుందరమైన హిమాలయాల సోయగం మనం వీక్షించవచ్చు.

7 / 7