AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2023: మొదలైన హోలీ సందడి.. పువ్వులతో హెర్బల్ రంగుల తయారీలో వితంతు మహిళల బిజిబిజీ

ముందుగా వితంతువులు బంకే బిహారీకి సమర్పించే పూల నుంచి నాణ్యమైన గులాబీలను వేరు చేసి ఒక చోట సేకరించి ఆరబెట్టి వదిలేస్తారు. దీని తరువాత.. తమ స్వంత చేతులతో కన్నయ్య విగ్రహాన్నీ అలంకరించేందుకు గులాల్ తయారు చేస్తారు.

Holi 2023: మొదలైన హోలీ సందడి.. పువ్వులతో హెర్బల్ రంగుల తయారీలో వితంతు మహిళల బిజిబిజీ
Herbal Gulal
Surya Kala
| Edited By: |

Updated on: Mar 02, 2023 | 4:26 PM

Share

పవిత్రమైన హోలీ పండుగ సందడి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా రాధా రాణి కీ జై .. కన్నయ్యకు జై అంటూ రంగుల రంగులు దర్శనమిస్తున్నాయి. హోలీని మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు.. దేశ వ్యాప్తంగా దుకాణాల్లో రంగులు నిండిపోయాయి. మరోవైపు బృందావన్‌లోని నిరాశ్రయులైన ఆశ్రమాల్లో నివసిస్తున్న వృద్ధ వితంతులు రంగుల తయారీలో నిమగ్నమై ఉన్నారు. బృందావనంలోని వితంతు బామ్మలు తయారు చేసే ఈ గులాల్ ప్రత్యేకత ఏమిటో.. వీరు హోలీని ఎలా జరుపుకుంటారో వివరంగా తెలుసుకుందాం..

 హోలీ రంగులు మథురలోని బృందావన్‌లోని కన్హా నగరంలో పరిసర ప్రాంతాల్లో హోలీని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రజలంతా రంగులు జల్లుకుంటూ ఉత్సాహంలో  మునిగిపోతారు. మరోవైపు.. పవిత్ర నగరమైన బృందావన్‌లో ఆశ్రమాల్లో నివసిస్తున్న నిరాశ్రయులైన వృద్ధులు, వితంతువులు  జరుపుకుంటారు.  తమకు అత్యంత ప్రియమైన వారితో హోలీ జరుపుకోవడానికి రంగులతో హొలీ ఆడుకోవడానికి హెర్బల్ గులాల్ తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ గులాల్ ప్రత్యేకత ఏమిటంటే హెర్బల్ రంగులు మాత్రమే కాదు.. ఈ రంగు శ్రీ కృష్ణుని ఆలయంలో సమర్పించబడిన పువ్వుల ప్రసాదం.  భక్తులు ప్రతిరోజూ కన్నయ్య ఆలయంలోకి వెళ్లారు. బృందావన్‌లోని వితంతువులు బాంకే బిహారీ ఆలయంలో సమర్పించిన పువ్వుల నుండి వివిధ రంగుల గులాల్‌లను తయారు చేయడంలో పగలు, రాత్రి నిమగ్నమై ఉన్నారు.

హెర్బల్ గులాల్ ఎలా తయారు చేస్తారంటే.. బాంకే బిహారీ ఆలయంలో సమర్పించే పువ్వుల నుండి గులాల్ తయారు చేయడంలో మొత్తం ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం ముందుగా వితంతువులు బంకే బిహారీకి సమర్పించే పూల నుంచి నాణ్యమైన గులాబీలను వేరు చేసి ఒక చోట సేకరించి ఆరబెట్టి వదిలేస్తారు. దీని తరువాత.. తమ స్వంత చేతులతో కన్నయ్య విగ్రహాన్నీ అలంకరించేందుకు గులాల్ తయారు చేస్తారు. ఇలా హెర్బల్ రంగులు తయారు చేస్తున్న వితంతు మహిళలకు బ్రజ్ గంధ ప్రసాద్ సమితి  రోజువారీ వేతనం ఇస్తారు.

ఇవి కూడా చదవండి

ఏ రోజు బాంకే బిహారీకి గులాల్ సమర్పిస్తారంటే..  వందలాది మంది మహిళలు అందమైన స్వచ్ఛమైన పువ్వులతో గులాల్‌ను తయారు చేస్తారు. ఈ రంగుల తయారీ నెల రోజుల ముందు నుంచి ప్రారంభిస్తారు. హొలీ సమయానికి రెడీ చేస్తారు. ఇలా తయారు చేసిన రంగులను ఏకాదశి రోజున ఠాకూర్ బాంకే బిహారీ ఆలయానికి తీసుకువెళ్లి కన్నయ్య  పాదాల వద్ద సమర్పిస్తారు. వితంతు మహిళల్లో ఒకరైన అనుపమ్ ముఖర్జీ.. హెర్బల్ గులాల్ చాలా భక్తితో తయారు చేస్తామని తద్వారా కన్నయ్య సంతోషించి అందరి బాధలను దూరం చేస్తాడని చెప్పారు. కన్నయ్య కోసం తయారు చేసే ఈ గులాల్‌ను తయారు చేయడం తమకు చాలా సంతోషాన్నిస్తుంది. ఇలా చేయడం వలన తమను ఆ కృష్ణయ్య ఆశీర్వదం లభిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ గులాల్‌తో  రాధా, కృష్ణులు హోలీ ఆడతారని ఆమె చెప్పారు. హోలీ రోజున.. వితంతు మహిళలు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ హోలీ పండగను జరుపుకుంటారు. హొలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)