AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. నిమిషాల వ్యవధిలోనే బుక్ అయిపోతున్న లక్షల టికెట్లు..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. స్వామి వారి దర్శనాలకు ఆన్ లైన్ లో మంచి డిమాండ్ ఉంది. మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన..

TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. నిమిషాల వ్యవధిలోనే బుక్ అయిపోతున్న లక్షల టికెట్లు..
Tirumala
Ganesh Mudavath
|

Updated on: Feb 26, 2023 | 6:43 AM

Share

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. స్వామి వారి దర్శనాలకు ఆన్ లైన్ లో మంచి డిమాండ్ ఉంది. మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆరు లక్షల టికెట్లను కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే బుక్‌ చేసుకోవడం గమనార్హం. వీటితో పాటు ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టికెట్లను రోజుకు 750 చొప్పున టీటీడీ రిలీజ్ చేసింది. వీటిని కేవలం 9 నిమిషాల వ్యవధిలో భక్తులు పొందారు. వయోవృద్ధులు, వికలాంగుల దర్శనానికి సంబంధించి రోజుకు వెయ్యి చొప్పున మార్చి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తే గంటా 35 నిమిషాల వ్యవధిలోనే అయిపోయాయి. రూ.10 వేల శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తే భక్తులు నుంచి అదే స్పందన లభిస్తోంది. కాగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 18 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది.

మరోవైపు.. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో శయనోత్సవం ఘనంగా జరిగింది. శనివారం రాత్రి శ్రీ ఉమాదేవి సమేత చంద్రశేఖరస్వామికి విశేష పూజలు, నివేదనలు జరిపారు. శయనోత్సవాన్ని గర్భాలయంలో కొలువు దీరిన శయనోత్సవ మూర్తులకు నిర్వహిస్తారు. వెండి పల్లకీల్లో.. ఓ వైపున చంద్రశేఖరస్వామి.. ఎదురుగా ఉమాదేవి.. ఇద్దరూ పల్లకీలో శయనోత్సవ మండపానికి తరలివచ్చారు. మండపాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. దేవతామూర్తులకు పూలలు, ఎండు ఫలాలు, సుగంధ ద్రవ్యాలతో మాలలు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!