TTD: భక్తులకు శుభవార్త.. ఇవాళ శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల.. వీటితో పాటు..
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన టిక్కెట్ల కోటాను..
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన టిక్కెట్ల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. రోజుకు 500 చొప్పున విడుదల చేయనున్నారు. వీటితో పాటు వసతి గదులకు సంబంధించిన టోకెన్లను కూడా అందుబాటులో ఉంచనుంది. తిరుమలలోని గోకులం కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్ల జారీని టీటీడీ ఇటీవల పునఃప్రారంభించింది. ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అందువల్ల ఫిబ్రవరి 28 వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను తిరుమలలో అందిస్తున్నారు.
మరోవైపు.. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం పల్లకీసేవ మహోత్సవం జరిగింది. అశేష భక్తకోటి సమక్షంలో జ్ఞానాంబిక సోమస్కందమూర్తిని వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే వివాహానికి ముందుగానే గంగాదేవితో పరిణయం అయిందన్న విషయాన్ని తెలుసుకున్న జ్ఞానాంబిక ఆగ్రహించి అలకబూనడం.. అమ్మవారిని బుజ్జగిస్తూ అయ్యవారు గంగాదేవిని వెంట పెట్టుకుని వెనుక వెంబడిస్తూ సాగిన ఉత్సవంతో భక్తులు తన్మయత్వం పొందారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..