KA.Paul: ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు.. కుక్కల నుంచీ కాపాడలేకపోతున్నారు.. సీఎం పై ఘాటు వ్యాఖ్యలు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తట్టుకోలేక పాత కేసులను బయటకు తీస్తున్నారని ఆరోపించారు. తనపై నమోదైన కేసుల..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తట్టుకోలేక పాత కేసులను బయటకు తీస్తున్నారని ఆరోపించారు. తనపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా కేసీఆర్ ప్రగతిభవన్ ఖాళీ చేస్తారని ఆక్షేపించారు. కనీసం కుక్కల నుంచి కూడా ప్రజలను కాపాడలేకపోతున్నారంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారంటూ మండిపడ్డారు. తెలంగాణ, రైతు, అమరవీరుల ద్రోహి కేసీఆర్ అని కేఏ.పాల్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
కామారెడ్డి రైతులకు న్యాయం చేశానన్న కక్షతో నన్ను చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారు. ఈ కారణంగానే నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. ఒక్క కామారెడ్డి మాత్రమే కాదు.. తెలంగాణ రైతుల పక్షాన నిలబడతాను. తెలంగాణలో ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున కేసీఆర్ నష్టం తీసుకొచ్చారు. సుప్రీంకోర్టులో మూడు కేసులు ఫైల్ చేసున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ‘కేసీఆర్ కళ్లు మూసుకుని పాలు కాదు.. మందు తాగుతున్నాడు. తెలంగాణ కోసం పోరాడుతున్నాను.. నన్ను డబ్బులతో ఎవడు కొనలేరు.
– కేఏ.పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
తనను చంపడానికి రాజశేఖర్ రెడ్డి, సోనియాగాంధీ ప్రయత్నించినా.. అది సాధ్యం కాలేదని కేఏ.పాల్ అన్నారు. దేవుడు పంపిన దూతను తానని మరోసారి ఉద్ఘాటించారు. అమరావతిని, దేశాన్ని అభివృద్ధి చేయగలను. దేశం కోసం, దేశాన్ని అప్పుల పాల్జేస్తున్నారనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. 2010 లో తన సోదరుడి హత్య జరిగినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..