AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పొంగులేటి గంగలో కలిసిపోవడం ఖాయం.. బీఆర్‌ఎస్‌ను చీల్చాలని చూస్తే ప్రజలే కొడతారు: ఎంపీ, ఎమ్మెల్యేల వార్నింగ్‌

ఎన్టీఆర్‌, కేసీఆర్‌ లాంటి మహానేతలతో పోల్చుకుంటే పొంగులేటి ..గంగలో కలిసిపోవడం ఖాయమన్నారు. పొంగులేటిని, అతని వర్గీయులను ప్రజలు ఉరికించి ఉరికించి కొట్టేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు నామా అండ్‌ రాములునాయక్‌.

Telangana: పొంగులేటి గంగలో కలిసిపోవడం ఖాయం.. బీఆర్‌ఎస్‌ను చీల్చాలని చూస్తే ప్రజలే కొడతారు: ఎంపీ, ఎమ్మెల్యేల వార్నింగ్‌
Telangana Politics
Basha Shek
|

Updated on: Feb 25, 2023 | 6:55 AM

Share

వైరా ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల మీటింగ్‌లో ప్రత్యర్ధులపై నిప్పులు చెరిగారు ఎంపీ నామా అండ్‌ ఎమ్మెల్యే రాములునాయక్‌. బీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే రెక్కలు విరగ్గొడతామంటూ హెచ్చరించారు. నక్క పులితోలు కప్పుకుంటే నక్కకు పులి లక్షణాలు వస్తాయా అంటూ పరోక్షంగా పొంగులేటిపై సెటైర్లేశారు. బీఆర్‌ఎస్‌ను చీల్చాలని చూస్తే ఎంతటివారికైనా బుద్ధి చెబుతామన్నారు ఎంపీ నామా. పార్టీలోనే ఉంటూ కోవర్టులుగా ఉండొద్దంటూ వార్నింగ్‌ ఇచ్చారు ఎమ్మెల్యే రాములునాయక్‌. ఎన్టీఆర్‌, కేసీఆర్‌ లాంటి మహానేతలతో పోల్చుకుంటే పొంగులేటి ..గంగలో కలిసిపోవడం ఖాయమన్నారు. పొంగులేటిని, అతని వర్గీయులను ప్రజలు ఉరికించి ఉరికించి కొట్టేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు నామా అండ్‌ రాములునాయక్‌. ఇక, ఉమ్మడి ఖమ్మంలో వార్‌ వన్‌సైడే అన్నారు ఎంపీ నామా. నాయకులు, కార్యకర్తలంతా కలిసి పనిచేస్తే పదికి పది స్థానాల్లోనూ బీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయమన్నారు. కాగా గత కొద్ది రోజులుగా అధికార పార్టీకి గళం వినిపిస్తున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఇప్పుడు ఆయనకే డైరెక్ట్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఉమ్మడి ఖమ్మం బీఆర్‌ఎస్‌ నేతలు. బీఆర్‌ఎస్‌ను చీల్చాలని చూస్తే ప్రజలు ఉరికించి ఉరికించి కొడతారంటూ హెచ్చరించారు.

కాగా గత ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్‌ (అప్పుడు టీఆర్‌ఎస్‌)లో ఉండి పార్టీకి ద్రోహం చేశారని, వైరా నియోజకవర్గంలోని పార్టీ అభ్యర్థిని ఓడించి స్వతంత్ర అభ్యర్థిని గెలిపించారని ఎంపీ, ఎమ్మెల్యేలు ఆరోపించారు.. అలాంటి కుట్రలను పార్టీ సహించబోదని అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ఎలాగైతే వ్యాక్సిన్‌ను కనుగొన్నారో శ్రీనివాసరెడ్డి విషయంలో తాము కూడా అలాగే వ్యాక్సిన్‌ను కనుగొంటామని బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..