AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓ యువతిని ప్రేమించి.. మరో యువతితో వివాహానికి రెడీ.. పెళ్లి పీటలపైనే వరుడు అరెస్ట్

హైదరాబాద్‌లో ఓ వరుడిని పెళ్లి పీటలపై అరెస్ట్‌ చేశారు పోలీసులు. మండపంలో బంధుమిత్రలందరి ముందు పట్టుకుని తీసుకెళ్లారు. ఇంతకీ ఎందుకు అరెస్ట్‌ చేశారు?  

Hyderabad: ఓ యువతిని ప్రేమించి.. మరో యువతితో వివాహానికి రెడీ.. పెళ్లి పీటలపైనే వరుడు అరెస్ట్
Groom Was Arrested
Surya Kala
|

Updated on: Feb 25, 2023 | 7:23 AM

Share

రోజుకి ఎన్ని మోసాలు వెలుగులోకి వచ్చినా ప్రేమ పేరుతో యువతులు మోసపోతూనే ఉన్నారు.. కొందరు దైర్యం చేసి.. తమకు జరిగిన అన్యాయం పై నోరువిప్పుతున్నారు. పోలీసు మెట్లు ఎక్కి న్యాయం కోరుతున్నారు బాధితులు.. తాజాగా ఓ యువకుడు ఓ యువతిని మోసం చేసి.. మరో యువతి మేడలో తాళి కట్టడానికి రెడీ అయ్యాడు. తర్వాత సినీ సీన్ ను తలపించేలా తాళి కట్టే సమయానికి పెళ్లి పీటల మీద అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో చోటు చేసుకుంది.

స్నేహమంటూ వెంటబడ్డాడు, ప్రేమంటూ దగ్గరయ్యాడు, పెళ్లి చేసుకుంటానంటూ లోబర్చుకున్నాడు. అతను చెప్పినవన్నీ నిజమేనని నమ్మి సర్వస్వం అర్పించుకుంది ఆ యువతి. ఇద్దరికీ ఒకే ప్రాంతం కావడంతో అతడిని పూర్తిగా నమ్మింది. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడనుకుని ఆర్ధికంగా ఆదుకుంది. కానీ, ఆమె ఆశలను సమాధి చేస్తూ మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు మోసగాడు. ఇది హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో జరిగింది. తనను ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా… మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దాంతో, పెళ్లి మండపంలోనే నిందితుడు పృథ్వీని అరెస్ట్‌ చేశారు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు.

కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా పృథ్వీని అదుపులోకి తీసుకున్నారు. అది కూడా పెళ్లి పీటలపై ఉండగా. తామిద్దరం రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నట్టు చెబుతోంది బాధితురాలు. అయితే, ప్రేమ పేరుతో లొంగదీసుకోవడమే కాకుండా తనను అన్నివిధాలా వాడుకున్నాడంటూ వాపోతోంది. ప్రేమ పేరుతో తన అవసరాలు తీర్చుకోవడమే కాకుండా డబ్బు కూడా భారీగానే గుంజాడు పృథ్వీ. బాధితురాలి కంప్లైంట్‌తో నిందితుడు పృథ్వీపై చీటింగ్‌ అండ్ రేప్‌ కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..