AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎక్మో పై ప్రీతికి చికిత్స.. వైద్య పరిస్థితిపై మంత్రి హరీశ్ ఆరా.. తల్లిదండ్రులకు పరామర్శ..

వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీశ్ రావు ఆరా తీశారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రీతి తల్లిదండ్రులను పరామర్శించారు. ధైర్యంగా..

Telangana: ఎక్మో పై ప్రీతికి చికిత్స.. వైద్య పరిస్థితిపై మంత్రి హరీశ్ ఆరా.. తల్లిదండ్రులకు పరామర్శ..
Minister Harish Rao
Ganesh Mudavath
|

Updated on: Feb 25, 2023 | 6:29 AM

Share

వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీశ్ రావు ఆరా తీశారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రీతి తల్లిదండ్రులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అయితే.. విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఉందనిృ నిమ్స్‌ వైద్యులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రీతికి వెంటిలేటర్‌, ఎక్మో సపోర్ట్‌తో వైద్యం అందిస్తున్నారు. ఇక నిమ్స్ లో ప్రీతి కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత హరీశ్ రావు కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు బీఎస్పీ కార్యకర్తలు. ర్యాగింగ్‌పై నిందితుడికి కఠిన శిక్షలు పడాలని.. అటు కాలేజీ యాజమాన్యంపైనా కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. అందోళన చేసిన కార్యకర్తలను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు.

కాగా.. కాకతీయ మెడికల్ కాలేజీ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అన్ని సాక్ష్యాలను తాము సేకరించినట్లు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ సైఫ్‌ను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రీతిని సైఫ్‌ వేధించినట్టు స్పష్టంగా కనిపిస్తోందని పోలీసు కమిషనర్‌ తెలిపారు. ఈ కేసును ర్యాగింగ్‌ చట్టం కింద చేపడుతున్నామని కమిషనర్‌ పేర్కొన్నారు.

Minister Harish Rao

Minister Harish Rao

వాట్సాప్‌ గ్రూప్‌లోనూ హేళన చేయడం కూడా ర్యాగింగ్‌ కిందకే వస్తుంది. ప్రీతిని సైఫ్‌ వేధించిన సంఘటనలు రెండు మూడు జరిగినట్టు గుర్తించాం. ఆత్మహత్యకు యత్నించిన డాక్టర్‌ ప్రీతి తెలివైన అమ్మాయి, ధైర్యవంతురాలనే విషయం ఆమె చాట్స్‌ ద్వారా అర్థమవుతోంది. టాక్సికాలాజీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం.

ఇవి కూడా చదవండి

           – రంగనాథ్, వరంగల్ సీపీ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు