Nara Lokesh: జూనియర్‌ ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి రానిస్తారా? యువకుల ప్రశ్నకు నారా లోకేశ్‌ సమాధానమేమిటంటే?

టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా వెలుగొందుతోన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు సైతం తారక్‌ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ మాత్రం రాజకీయాల్లో రావడానికి ఇంకా సమయముందంటున్నారు

Nara Lokesh: జూనియర్‌ ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి రానిస్తారా? యువకుల ప్రశ్నకు నారా లోకేశ్‌ సమాధానమేమిటంటే?
Jr Ntr, Nara Lokesh
Follow us
Basha Shek

|

Updated on: Feb 25, 2023 | 5:50 AM

టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా వెలుగొందుతోన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు సైతం తారక్‌ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ మాత్రం రాజకీయాల్లో రావడానికి ఇంకా సమయముందంటున్నారు. ప్రస్తుతానికైతే సినిమాల మీదనే తన దృష్టి ఉందంటున్నారు. ఈక్రమంలో తారక్‌ పొలిటికల్‌ ఎంట్రీకి సంబంధించి టీడీపీ నేత నారా లోకేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో పర్యటిస్తోన్న ఆయన అక్కడి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ ఆహ్వానిస్తుందా అన్న ప్రశ్నకు నారా లోకేష్ ఇంట్రెస్టింగ్‌ ఆన్సర్‌ ఇచ్చారు. ‘జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు. నూటికి నూరు శాతం ఆహ్వానిస్తాం. ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అగ్ర స్థానానికి వెళ్లాలి, ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్లందరూ రాజకీయాల్లోకి రావాలి’ అంటూ తారక్‌ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై లోకేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

తారక్‌ పొలిటికల్‌ ఎంట్రీపై నారాలోకేశ్‌ చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇక కుప్పంలో మొదలైన లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. అలాగే సాయంత్రం పూట హలో లోకేశ్‌ పేరిట విద్యార్థులు, యువతతో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 25 తిరుపతి అంకుర ఆసుపత్రి సమీపంలో ‘హలో లోకేశ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతతో సమావేశమయ్యారు లోకేశ్. యువత అడిగిన ప్రశ్నలకు లోకేశ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈక్రమంలోనే తారక్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేశ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి