AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage In Hospital: అస్వస్థతకు గురై ఆస్పత్రిలో వధువు.. ఐసీయూలోనే తాళి కట్టిన వరుడు.. పెళ్లిపెద్దలుగా వైద్య సిబ్బంది

పెండ్లి మండపం లేదు.. భాజాభజంత్రీలు లేవు.. కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల సందడి లేదు.. కానీ పెళ్లి‌ జరిగింది.. అలా ఇలా కాదు ఏకంగా ఆస్పత్రిలోనే మూడు ముళ్ల బంధం ముడిపడింది. నిరాడంబరంగా జరిగిన ఈ వివాహం మంచిర్యాల ఆస్పత్రిలో చోటు చేసుకుంది. 

Marriage In Hospital: అస్వస్థతకు గురై ఆస్పత్రిలో వధువు.. ఐసీయూలోనే తాళి కట్టిన వరుడు.. పెళ్లిపెద్దలుగా వైద్య సిబ్బంది
Marriage In Hospital 1
Surya Kala
|

Updated on: Feb 23, 2023 | 8:53 PM

Share

మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. పెండ్లి పీఠలపై జరుగవలసిన పెండ్లి ఏకంగా ఆసుపత్రిలో జరిగింది. శస్త్ర చికిత్స జరిగి కదలలేని పరిస్థితిలో ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు వరుడు తాళికట్టి అందర్ని సంభ్రమశ్చార్యంలో ముంచెత్తాడు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కు చెందిన బానోథ్ శైలజ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజు పల్లె గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతి కి వివాహం నిశ్చయం అయ్యింది. గురువారం లంబాడిపల్లిలో పెండ్లి జరగవలసి ఉండగా వధువు శైలజ బుధవారం అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. యువతిని పరీక్షించిన వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఇన్ పేషేంట్ గా ఉండిపోయింది. విషయం పెండ్లి కుమారుడు తిరుపతి కి తెలియడంతో కంగారుపడ్డాడు.

Marriage In Hospital 2

Marriage In Hospital 2

ఓ వైపు ఇరు కుటుంబాలు పేదలు కావడం పెండ్లి ఏర్పాట్లు చేయడం మళ్ళీ పెండ్లి అంటే ఖర్చు అధికం అవుతుందని భావించారు. ఎలాగైనా గురువారం పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి పెండ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఇరు కుటుంబ సభ్యలను ఒప్పించాడు పెళ్లికొడుకు. శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వైద్యులకు విషయం చెప్పాడు. వరుడు మంచి మనసును అర్థం చేసుకున్న వైద్యులు పెండ్లికి ఒప్పుకున్నారు. వైద్యులే పెండ్లి పెద్దలుగా మారగా.. బెడ్ చికిత్స పొందుతున్న వదువు శైలజకు వరుడు తిరుపతి మాంగళ్యధారన చేశాడు. ఇద్దరు పూల దండలు మార్చుకుని దంపతులుగా మారారు.

వధువు కుటుంబ సభ్యులు, వరుడు కోరిన మీదట పెండ్లికి అనుమతి ఇచ్చామని వైద్యుడు ఫణికుమార్ తెలిపారు. శైలజ కు బుధవారం ఆపరేషన్ చేశామని వారం రోజులు విశ్రాంతి అవసరమని తెలిపారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

Reporter: Naresh

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..