TSLPRB: తెలంగాణ పోలీసు ట్రాన్స్‌పోర్టు విభాగం అభ్యర్ధులకు మార్చి 2 నుంచి ట్రేడ్ టెస్టులు
పోలీసు ట్రాన్స్‌పోర్టు విభాగంలో డ్రైవింగ్, మెకానిక్ అభ్యర్థులకు మార్చి 2 నుంచి ట్రేడ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. అలాగే డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఫైర్ విభాగంలో డ్రైవర్ పోస్టులకు కూడా ఇదే తేదీల్లో..
పోలీసు ట్రాన్స్‌పోర్టు విభాగంలో డ్రైవింగ్, మెకానిక్ అభ్యర్థులకు మార్చి 2 నుంచి ట్రేడ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. అలాగే డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఫైర్ విభాగంలో డ్రైవర్ పోస్టులకు కూడా ఇదే తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు తన ప్రకటనలో తెల్పింది. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ పరీక్ష నిర్వహిస్తామని వివరించింది. వీరందరికీ మార్చి 2 నుంచి 23 వరకు హైదరాబాద్ అంబర్‌పేటలోని సీపీఎల్ మైదానంలో ట్రేడ్ టెస్టులు నిర్వహిస్తామని బోర్డు వెల్లడించింది. టెస్టులకు హాజరయ్యేవారు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫిబ్రవరి 25 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 28 అర్ధరాత్రి వరకు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెల్పింది. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే support@tslrpb.in కు గానీ 9393711110 లేదా 9391005006 నంబర్లకు సంప్రదించవచ్చని పేర్కొంది.
అడ్మిట్ కార్డు పై భాగంలో అభ్యర్థి వివరాలు, పరీక్ష సమయం, వేదిక, సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలు ఉంటాయి. కింది భాగాన్ని చెకప్ స్లిప్‌గా సంబంధిత అధికారి పరీక్షా కేంద్రంలో రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకుంటారు. అందువల్ల డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డులు నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా భద్రపరచుకోవల్సి ఉంటుంది. ఇతర వివరాలు వెబ్‌సైట్‌లో చెక్‌చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.