Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 2 గంటల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయని టీటీడీ అధికారులు చెప్పారు. 

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
Tirumala Temple
Follow us
Surya Kala

|

Updated on: Feb 23, 2023 | 8:38 PM

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను  శుక్రవారం (ఫిబ్రవరి 24వ తేదీ) ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 2 గంటల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయని టీటీడీ అధికారులు చెప్పారు.

అదేవిధంగా, మార్చి నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవాటికెట్ల కోటాను, సంబంధిత దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తారని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.

మరో వైపు తిరుమలలో శ్రీవాణి ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్ల జారీ పునః ప్రారంభం చేసింది టీటీడీ. ఫిబ్రవరి 28 వరకు రోజుకు 150 టిక్కెట్లు రిలీజ్ చేయనుంది. మార్చి నుండి, 1000 శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.

ఇవి కూడా చదవండి

తిరుమలలోని గోకులం కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టిక్కెట్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కావున తిరుమలలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు. టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆఫ్ లైన్ లో టికెట్లు పొందాలని టీటీడీ అధికారులు కోరారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..