AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Bite: కుక్క కరిస్తే నిర్లక్ష్యం వద్దు.. రక్త స్రావం వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి.. ఎన్ని రోజులు వ్యాక్సిన్ వేస్తారో.. డీటైల్స్ మీకోసం

కుక్కల దాడిలో గాయపడిన వారికి చికిత్స లో భాగంగా బొడ్డు చుట్టూ ఇంజక్షన్ లు ఇచ్చే చికిత్స గతంలో అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ట్రీట్మెంట్ లో భాగంగా కుక్క కరిచిన వ్యక్తికి ఐదుసార్లు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కుక్క కరిచిన చోట రక్త స్రావం అయితే మాత్రం ఈ వ్యాక్సిన్ తో పాటు కరిచిన రెండు రోజుల లోపు..

Dog Bite: కుక్క కరిస్తే నిర్లక్ష్యం వద్దు.. రక్త స్రావం వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి.. ఎన్ని రోజులు వ్యాక్సిన్ వేస్తారో.. డీటైల్స్ మీకోసం
Dog Bite Treatment
Surya Kala
|

Updated on: Feb 22, 2023 | 7:26 PM

Share

ఇటీవల కాలం లో కుక్క కరిచిన ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణాలో మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కుక్క కరిసిన కేసులు బాగా పెరుగుతున్నాయి. సమ్మర్ వస్తుండడం తో పాటు కుక్కలకి బ్రీడింగ్ టైం అవ్వడం తో ఈ కేసులు పెరుగుతున్నాయి అని వెటర్నరీ వైద్యులు అంటున్నారు. అసలు కుక్క కరిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఆ ట్రీట్మెంట్ ఎక్కడ అందుబాటులో ఉంది? కుక్క కాటు.. ప్రాణాలకు ప్రమాదం కాకుండా ఉండాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి తెలుసుకుందాం..

వీధి కుక్కల దాడిలో గాయపడిన వారికి చికిత్స లో భాగంగా బొడ్డు చుట్టూ ఇంజక్షన్ లు ఇచ్చే చికిత్స గతంలో అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ట్రీట్మెంట్ లో భాగంగా కుక్క కరిచిన వ్యక్తికి ఐదుసార్లు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కరిచిన రోజు, మూడవ రోజు, ఏడవ రోజు, 14వ రోజు, 28వ రోజు భుజానికి రెబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. కుక్క కరిచిన చోట రక్త స్రావం అయితే మాత్రం ఈ వ్యాక్సిన్ తో పాటు కరిచిన రెండు రోజుల లోపు ఇమ్యునోగ్లోబిలిన్స్ ఇంజక్షన్ కరిచిన చోట తీసుకోవాలి.

ఈ ఇమ్యునోగ్లోబిలిన్స్ ఇంజెక్షన్ శరీరానికి ఇమీడియట్ బూస్టర్ల పనిచేస్తుంది. దీనివల్ల కరిచిన కుక్క పిచ్చి కుక్క అయితే రేబిస్ వ్యాధి సోకకుండా ఉపయోగపడుతుంది. కుక్క కాటునీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం రెబిస్ వ్యాధి సోకుతుంది. రేబిస్ సోకితే ప్రపంచం ఎక్కడ ట్రీట్మెంట్ లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే కుక్క కరిస్తే ఐపిఎ కో ..లేక ఫీవర్ ఆస్పత్రి కో ట్రీట్మెంట్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదంటున్నరు ప్రభుత్వ వైద్యులు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్సీలలో, ఏరియా ఆసుపత్రులలో, జిల్లా ఆసుపత్రులలో కుక్కకాటుకు సంబంధించిన వ్యాక్సిన్, మెడిసిన్ అందుబాటులో ఉంది అని చెబుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా చికిత్స అందుబాటులో ఉందని వైద్యులు అంటున్నారు. కుక్క కాటుకంటే దాని పట్ల నిర్లక్షమే ఎక్కువ ప్రమాదకరమైనది. తప్పుడు సలహాలు విని నిర్లక్ష్యం చేస్తే మృత్యువాత పాడడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Reporter: Yellender

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారీగా పతనమైన బంగారం ధరలు.. కొనాలంటే ఇదే బెస్ట్‌ టైమ్‌..!
భారీగా పతనమైన బంగారం ధరలు.. కొనాలంటే ఇదే బెస్ట్‌ టైమ్‌..!
ఐ-టెక్ వాష్‌రూమ్, షవర్,వేడి ఆహారం! రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పోటీగా
ఐ-టెక్ వాష్‌రూమ్, షవర్,వేడి ఆహారం! రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పోటీగా
లక్షాధికారిని చేసే స్కీమ్‌..నెలకు రూ.6 వేలు డిపాజిట్‌ చేస్తే చాలు
లక్షాధికారిని చేసే స్కీమ్‌..నెలకు రూ.6 వేలు డిపాజిట్‌ చేస్తే చాలు
ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి.. భక్తులు తప్పక..
ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి.. భక్తులు తప్పక..
సౌదీ అరేబియాపై హౌతీల భీకర దాడులు.. భారత్ కీలక ప్రకటన..
సౌదీ అరేబియాపై హౌతీల భీకర దాడులు.. భారత్ కీలక ప్రకటన..
అండర్-19 మహిళల ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది
అండర్-19 మహిళల ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది
తేనె నిజంగానే తేనెటీగల వాంతినా? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
తేనె నిజంగానే తేనెటీగల వాంతినా? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సంజు శాంసన్ కేరళ ఇల్లు చూశారా?
సంజు శాంసన్ కేరళ ఇల్లు చూశారా?
దీపావళికి ఒకే దీపాన్ని మళ్లీ మళ్లీ వెలిగించవచ్చా? కొత్త ప్రమిద..
దీపావళికి ఒకే దీపాన్ని మళ్లీ మళ్లీ వెలిగించవచ్చా? కొత్త ప్రమిద..
దీపావళి పూజలో లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసా!
దీపావళి పూజలో లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసా!