AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: తెలంగాణ అబ్బాయి.. బెంగాల్ అమ్మాయి .. పూరి ఆలయంలో ఏకమైన వేళ

వివాహ వేడుకలు జరిగిన ఒడిస్సాలోని పూరీ జగన్నాథ దామమ్ పెళ్లి కుమారుడు అంజు లడ్డా స్వగ్రామమైన బైంసా నుంచి సరిగ్గా 1111 కిలో మీటర్లు దూరం ఉండగా పెళ్లి కూతురు డింపల్ స్వగ్రామమైన సిల్లిగూడి నుంచి సరిగ్గా 999 కిలో మీటర్ల దూరం కావడం విశేషం.

Viral News: తెలంగాణ అబ్బాయి.. బెంగాల్ అమ్మాయి .. పూరి ఆలయంలో ఏకమైన వేళ
Wedding Viral News
Surya Kala
|

Updated on: Feb 24, 2023 | 1:19 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన అబ్బాయికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర్ దినజ్ పూర్ జిల్లా సిల్లిగుడి ప్రాంతానికి చెందిన అమ్మాయితో ఓడిస్సా రాష్ట్రంలోని పూరీ జగన్నాధ దామము లో పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాల వారు గురువారం వివాహ వేడుకలను అక్కడ అంగంగ వైభ వంగా నిర్వహించారు. బైంసాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త శ్యాంసుందర్ మున్నా లడ్డా, మంజూ లడ్డాల కుమారుడు అంజు లడ్డాకు పశ్చిమ బెంగాల్ కు చెందిన సుభాష్ బియాని,శశి బియానిల కూతురు డింపల్ తో పెళ్లి కుదిరింది. అయితే భైంసాకు చెందిన శ్యాం సుందర్ మున్నా లడ్డాకు తమ కుమారుని వివాహాన్ని ఓడిస్సా రాష్ట్రంలో పూరీ జగన్నాథ దామమ్ శ్రీ కృష్ణుడు, సుభద్ర, బలరాముని ఆలయ ప్రాంగణంలోని జరుపాలని కోరిక ఉండేది. ఇందుకు పెళ్లి కూతురు కుటుంబీకులు సైతం అంగీకరించారు. దీంతో ఇరు కుటుంబాల వారు తమ బంధు, మిత్రులతో కలిసి గురువారం జరిగిన వివాహ వేడుకల కోసం రెండు రోజుల ముందుగానే ఒడిస్సా జగన్నాథ ఆలయానికి తరలివెళ్లారు.

సుదూరంలో పెళ్లి.. పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు’…

వివాహ వేడుకలు సుదూరంలో ఉండటంతో పరిమిత సంఖ్యలో బంధు, మిత్రులు తరలివెళ్లారు. ఒక్కో వైపు నుంచి కేవలం 251 మంది మాత్రమే వేడుకలకు హాజరయ్యారు. ఇక వివాహ వేడుకలు జరిగిన ఒడిస్సాలోని పూరీ జగన్నాథ దామమ్ పెళ్లి కుమారుడు అంజు లడ్డా స్వగ్రామమైన బైంసా నుంచి సరిగ్గా 1111 కిలో మీటర్లు దూరం ఉండగా పెళ్లి కూతురు డింపల్ స్వగ్రామమైన సిల్లిగూడి నుంచి సరిగ్గా 999 కిలో మీటర్ల దూరం కావడం విశేషం. ఇలా ఇద్దరి ప్రాంతాల నుంచి కిలో మీటర్ల దూరం ఒకే అంకెతోనే ఉండటం, బంధు, మిత్రులు ఒకే సంఖ్యలో హజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇవి కూడా చదవండి

 సైకిల్ రిక్షాపై వధూవరులు…

ఇక పెళ్లిలో విశేషం ఏమిటంటే వధూ వరులు బస చేసిన విడిది కేంద్రం నుంచి వివాహ వేదిక వరకు సైకిల్ రిక్షా పై తరలివెళ్లారు. వరుడు పెళ్లి కూతురిని సైకిల్ రిక్షా పై కూర్చోబెట్టుకొని తొక్కుకుంటూ తీసుకవెళ్లాడు. వివాహ వేడుకలు ఆద్యంతం నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిగాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..