Viral Video: థంప్స్‌తో పానీ పూరి.. వావ్ అంటున్న మహిళ.. ఎందుకురా ఈ ప్రయోగాలు అంటున్న నెటిజన్లు
ఓ వ్యక్తి థమ్స్ అప్‌తో పానీపూరీని సిద్ధం చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ థమ్స్ అప్‌తో తయారు చేసిన పానీపూరీని రుచి చూసి.. బాగుంది అని కితాబిచ్చింది.
స్ట్రీట్ ఫుడ్ ను చాలామంది ఇష్టపడతారు. చిరుతిండి సాధారణంగా ప్రతిచోటా అందుబాటులో ఉంటుంది. ఈ స్ట్రీట్ ఫుడ్ లో భేల్ పూరి, పానీ పూరి, ఛాట్, సమోసా వంటి అనేక రకాలైన నోరూరించే ఎంపికలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి పానీపూరి.. దీనిని చాలా మంది ఆహారప్రియులు ఇష్టంగా తింటారు. అయితే పానీ పూరి, దహి పూరి, స్వీట్ పూరి వంటి రకాలున్నాయి. అయినప్పటికీ వీటిని సరికొత్త ప్రయోగాలు చేస్తే.. మాత్రం పెద్దగా స్ట్రీట్ ఫుడ్ ప్రియులు అంగీకరించరు.. అంతేకాదు అటువంటి వంటకాలను తయారు చేస్తున్నవారిని చూస్తే చికాకు పడతారు కూడా.. తాజాగా ఓ వ్యక్తి థమ్స్ అప్‌తో పానీపూరీని సిద్ధం చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ థమ్స్ అప్‌తో తయారు చేసిన పానీపూరీని రుచి చూసి.. బాగుంది అని కితాబిచ్చింది. అయినప్పటికీ నెటిజన్లు తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ఫ్యూజన్ డిష్ తినదగినదని ఎక్కువ మంది అనుకోవడం లేదు.
ఓ ట్విటర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. “పానీ పూరీ ప్రేమికులారా.. ఇదిగో థంప్స్ అప్ పానీ పూరీని ప్రదర్శిస్తున్నాను… థంబ్స్ గుర్తుతో ప్రేమను తేలియజేయండి.. అని వీడియోతో పాటు కామెంట్ జత చేశారు.
వైరల్ వీడియోలో డిష్ సిద్ధం చేయడానికి మనిషి నీటికి బదులుగా థమ్స్ అప్‌ని ఎలా ఉపయోగించాలో క్లిప్ లో చూపించారు. ఇలా చేయడం వలన పానీ పూరికి ఉపయోగించే పానీయం రుచిని మెరుగుపరచడానికి అనేక మసాలా దినుసులను కూడా జోడించాడు. ఒక మహిళ వంటకం రుచి చూసి..తనకు నచ్చిందని షేర్ చేయడంతో క్లిప్ ముగుస్తుంది.
వీడియోపై ఒకసారి లుక్ చేయండి..
Pani Puri lovers, here’s presenting Thump’s up Pani Puri…
Shower your love with Thumbs down??? pic.twitter.com/Gjuo9c4PoE
— Mohammed Futurewala (@MFuturewala) February 9, 2023
కొన్ని రోజుల క్రితం వీడియో పోస్ట్ చేయబడింది. ట్వీట్ చేసినప్పటి నుండి.. వీడియోకు 7,700 కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది. రోజు రోజుకీ వ్యూస్ పెరుగుతూనే ఉంటుంది. ఈ వీడియో గురించి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓ ప్రియా.. దీనిని చూసి “నేను ఏడుస్తున్నానని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు భూమిపై ప్రజలు ఉత్తమమైన ఆహార పదార్థాలతో ఎందుకు ఇలా ప్రయోగాలు చేస్తున్నారు” అని కామెంట్ చేశాడు. “లేదు, లేదు.. దయచేసి పానీపూరిని నాశనం చేయలేరు,” అని మరొకరు కామెంట్ చేశాడు. “ఇది 20 సంవత్సరాల క్రితం జరిగింది .. నేను ఇక నుంచి తిననని ప్రమాణం చేస్తున్నానని మరొకరు వ్యాఖ్యానించారు. దీనిని నా కాలేజీ ఫ్రెండ్స్ పరిచయం చేశారు. అప్పుడు దీన్ని మొదటిసారి.. చివరిసారిగా రుచి చూశానని కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..