Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending News: 3 గంటల పాటు ఆగిన చిన్నారి గుండె..అద్భుతం చేసిన వైద్యులు.. తిరిగి ప్రాణం పోసిన సిబ్బంది..

బాలుడ్ని చికిత్స కోసం లండన్‌కు 100 కిలోమీటర్ల దూరంలో చార్లెట్ ఎలేనోర్ ఎంగ్లేహర్ట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చేర్చిన వెంటనే వైద్యులు బాలుడికి చికిత్స అందించడంలో నిమగ్నమయ్యారు. అప్పటికే అపస్మారస్థితిలోకి వెళ్లిపోయి గుండె ఆగిపోయింది.

Trending News:  3 గంటల పాటు ఆగిన చిన్నారి గుండె..అద్భుతం చేసిన వైద్యులు.. తిరిగి ప్రాణం పోసిన సిబ్బంది..
Waylon Saunders
Follow us
Surya Kala

|

Updated on: Feb 23, 2023 | 7:24 PM

దాదాపు మరణం అంచుకు చేరుకున్న చిన్నారి ప్రాణాలను కాపాడి కెనడా వైద్యులు అద్భుతం చేశారు. గత నెలలో రెండున్నరేళ్ల చిన్నారి బాలుడు స్విమ్మింగ్ ఫూల్ లో పడ్డాడు. అయితే ఆ బాలుడు స్విమ్మింగ్ ఫూల్ లో పడిన విషయం ఎవరూ చూడలేదు. దీంతో ఆ బాలుడు ఆ చల్లటి నీటిలో చాలా సేపు ఉండిపోయాడు. తరువాత.. అగ్నిమాపక సిబ్బంది నీటిలో తేలియాడుతున్న చిన్నారిని గమనించారు. వెంటనే ఆ బాలుడిని నీటిలో నుండి బయటకు తీసి ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన ఇది కెనడాలోని ఒంటారియోలోని పెట్రోలియాలో జనవరి 24న జరిగింది.

మీడియా నివేదికల ప్రకారం.. బాలుడ్ని చికిత్స కోసం లండన్‌కు 100 కిలోమీటర్ల దూరంలో చార్లెట్ ఎలేనోర్ ఎంగ్లేహర్ట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చేర్చిన వెంటనే వైద్యులు బాలుడికి చికిత్స అందించడంలో నిమగ్నమయ్యారు. అప్పటికే అపస్మారస్థితిలోకి వెళ్లిపోయి గుండె ఆగిపోయింది. ఒళ్లంతా చల్లబడిపోయింది.  వైద్యులు అద్భుతం చేశారు. చిన్నారి ప్రాణాలు నిలపడానికి వైద్యులు చేసిన తీవ్ర ప్రయత్నాలు ఫలించాయి. దాదాపు మూడు గంటలపాటు చిన్నారికి సీపీఆర్‌ అందించారు వైద్యులు. గంటల తర్వాత బాలుడు స్పృహలోకి వచ్చాడు. దీంతో వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిలో ఆనందం వెల్లివిరిసింది.

ఫిబ్రవరి 6న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి  మీడియా నివేదికలో.. లండన్ హెల్త్ సైన్సెస్ సెంటర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో వేలాన్ సాండర్స్ అనే పిల్లవాడు ఫిబ్రవరి 6 న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. బాలుడు ఆస్పత్రికి వచ్చేసరికి పరిస్థితి చాలా విషమంగా ఉంది. బాలుడి ప్రాణాలను నిలపడానికి  ఆస్పత్రి సిబ్బంది నైపుణ్యం, దృఢసంకల్పం,  జట్టుకృషి వల్లనే సాధ్యమైందని ఆసుపత్రికి చెందిన వైద్యుడు చెప్పారు.

ఇవి కూడా చదవండి

ప్రాణాపాయం నుంచి బయటపడిన బాలుడు  వెలన్‌ గురించి ఇంట్లో తగు జాగ్రత్తలు తీసుకుంటామని.. తమ పిల్లాడు కోలుకునేలా చూసుకుంటామని వేలన్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. మంచులో ఉండి గడ్డకట్టిన బాలుడిని కాపాడేందుకు అందరూ కలిసి పనిచేశారని లండన్‌ ఆస్పత్రి వైద్యుడు టేలర్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డరని.. తమ నైపుణ్యాలను ఉపయోగించారని.. అందరూ కలిసి జట్టుగా కలిసి పనిచేశారని  చెప్పాడు. అయినప్పటికీ తాము బాలుడు కోలుకుంటాడని.. తాము అస్సలు ఊహించలేదని చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..