Turkey Earthquake: టర్కీలో భూకంపానికి కుప్పకూలిన భవనం .. భయంతో పారిపోతున్న జనం.. వీడియో వైరల్
టర్కీలోని హతాయ్ ప్రావిన్స్‌లో సోమవారం రాత్రి 6.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరో ముగ్గురు వ్యక్తులు మరణించారు. తాజా ప్రకంపనల కారణంగా భవనం కూడా కూలిపోయింది.
ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాను అతలాకుతలం చేసిన భూకంపం ఇంకా శాంతించలేదు. తాజాగా మరోసారి భారీ తీవ్రతతో టర్కీపై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 20 రాత్రి భూమి కంపించడంతో హతాయ్ ప్రావిన్స్ లో భారీ భవనం ఒకటి పేకమేడలా కూలిపోయింది. దీంతో భారీగా దుమ్ము ఎగిసిపడింది. దాంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టర్కీలోని హతాయ్ ప్రావిన్స్‌లో సోమవారం రాత్రి 6.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరో ముగ్గురు వ్యక్తులు మరణించారు. తాజా ప్రకంపనల కారణంగా భవనం కూడా కూలిపోయింది. భూకంపం కారణంగా సిరియాలో భవనం కూలిపోయిందని ఏపీ నివేదికలు తెలిపాయి. కొత్త భూకంపం తర్వాత రెండోసారి 5.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. హతాయ్ లో భూకంపం కారణంగా అనేక భవనాలు కూలిపోయాయని, ప్రజలు లోపల చిక్కుకున్నారని హటే మేయర్ చెప్పారు. భవనం కూలిన దృశ్యం కూడా కెమెరాలో చిక్కుకుంది, అక్కడ ప్రజలు కూలిపోయిన ప్రదేశం నుండి దూరంగా పారిపోతున్నారు.
First visuals of new #earthquake in #Syria #Turkey buildings collapse ,,,ya Allah have mercy on people of #turkeysyria #Turkiye #Hatay #Turkiye #turkeyearthquake2023 #turkiyeearthquake #syriaearthquake #المنتدى_السعودي_للإعلام pic.twitter.com/gXOHjwgTvA
— MC Immy kashmir (umar bhat) (@Immybhat1) February 20, 2023
ఫిబ్రవరి 20 రాత్రి సంభవించిన భూప్రకంపనలకు పలు భవనాలు కూలిపోయాయని, అందులో చాలామంది చిక్కుకుపోయారని చెప్పారు. హతాయ్ ప్రావిన్స్ లోని డెఫ్నే సిటీలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వివరించారు. ఫిబ్రవరి 20 రాత్రి సిరియా, జోర్డాన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ లలో కూడా భూ ప్రకంపనలు నమోదయ్యాయని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..