Javed Akhtar: ముంబై దాడులకు పాల్పడ్డవాళ్లు ఇక్కడే ఉన్నారు.. పాక్ గడ్డపైనే జావేద్‌ అక్తర్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌

ముంబైపై దాడి చేసిన టెర్రరిస్టులు ఇక్కడే తిరుగుతున్నారు... పాకిస్తాన్‌ను భారతీయులు తిట్టడంలో తప్పు లేదంటూ ఆ దేశం గడ్డ మీదే ఉతికి ఆరేశారు ప్రముఖ కవి జావేద్‌ అక్తర్‌. పాక్‌ నిజస్వరూపాన్ని బయటపెట్టిన జావేద్‌ అక్తర్‌పై కంగనాతో సహా పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు

Javed Akhtar: ముంబై దాడులకు పాల్పడ్డవాళ్లు ఇక్కడే ఉన్నారు.. పాక్ గడ్డపైనే జావేద్‌ అక్తర్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌
Javed Akhtar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 21, 2023 | 9:31 PM

పాకిస్తాన్‌ గడ్డ మీద ఆ దేశాన్ని నిందించడమంటే మామూలు మాట కాదు. కానీ భారత్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత జావేద్‌ అక్తర్‌ ఆ పనే చేశారు. లాహోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు జావేద్‌ అక్తర్‌.. ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఎక్కడి నుంచో రాలేదని మీ దేశంలోనే తిరుగుతున్నారంటూ జావేద్‌ అక్తర్‌ పాక్ ను చెమటలు పట్టించారు. పాకిస్తాన్‌ను భారతీయులు నిందించడానికి అర్ధం ఉందన్నారు జావేద్‌ అక్తర్‌. రెండు దేశాల మధ్య శతృత్వం అవసరం లేదని అన్నారు. పాక్‌ కళాకారులకు భారత్‌లో ఘనంగా సన్మానాలు జరిగాయని, కానీ లతా మంగేష్కర్‌ లాంటి లెజెండ్‌ను పాకిస్తాన్‌ ఒక్కసారి కూడా సన్మానించలేదని తీవ్రంగా విమర్శించారు.

ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ సంస్మరణార్థం లాహోర్‌లో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జావేద్‌ అక్తర్‌ హాజరయ్యారు. జావేద్‌ అక్తర్‌ పాక్‌ ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జావేద్‌ అక్తర్‌ అభినందనలు వెలువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

గతంలో జావేద్‌ అక్తర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించిన కంగనా రనౌత్‌ కూడా ఆయనకు ఫ్యాన్‌గా మారిపోయారు.

జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యలు మాటల తుటాలని.. పాక్‌ గడ్డపై ఆయన చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌గా కంగనా ట్వీట్‌ చేశారు. కాగా.. జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే