Cash in Bank locker: లాకర్‌లో దాచుకున్న డబ్బుకు చెదలు.. లబోదిబోమన్న మహిళ.. ఆ నష్టం ఎవరికీ ఇప్పుడు.?
పంజాబ్ నేషనల్ బ్యాంకులో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. లాకర్‌లో దాచుకున్న డబ్బుకు చెదలు పట్టాయి. దాందో కస్టమర్ లబోదిబోమన్నారు. తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలంటూ బ్యాంకు సిబ్బందిపై మండిపడ్డారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. లాకర్‌లో దాచుకున్న డబ్బుకు చెదలు పట్టాయి. దాందో కస్టమర్ లబోదిబోమన్నారు. తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలంటూ బ్యాంకు సిబ్బందిపై మండిపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్, ఉదయ్‌పూర్‌లో జరిగింది. కాలాజీ గోరాజీలోని పీఎన్‌బీ బ్రాంచ్‌లో సునీత మెహతా అనే మహిళ సుమారు 2 లక్షల వరకూ నగదు దాచుకున్నారు. ఇటీవల డబ్బు అవసరమై ఓ రోజు ఆమె లాకర్‌లోని డబ్బును ఇంటికి తెచ్చుకున్నారు. ఈక్రమంలో డబ్బు ప్యాకెట్‌ను తెరిచి చూస్తే కొన్ని కరెన్సీ నోట్లు పొడిపొడిగా అయిపోయి కనిపించాయి. చెదలు పట్టడంతో నోట్లు నాశనమయ్యాయని గుర్తించిన ఆమె బిత్తరపోయింది. దాదాపు 15 వేల రూపాయల వరకూ నోట్లన్నీ పూర్తిగా చెదలు తినేసాయి. మరికొన్ని నోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెంటనే ఆ నగదు తీసుకొని బ్యాంకుకు వెళ్లిన ఆమె సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం తన డబ్బు వాపస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్యాంకు మేనేజరుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో..బాధితురాలు నష్టపోయిన మొత్తాన్ని బ్యాంకు అప్పటికప్పుడు తిరిగిచ్చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

