Pak-Talibans: పాముకి పాలుపోస్తే ఇలాగే ఉంటుంది.. పాక్‌ లోకి తాలిబన్ల చొరబాటు.. ఇస్లామిక్‌ రాజ్యం ఏర్పాటు చేస్తామని ప్రకటన

పాముకు పాలు పోసి పెంచిన పాకిస్తాన్‌ కు భారీ షాక్ తగిలింది. దేశాన్ని ఆక్రమించేందుకు పాక్‌ తాలిబన్ల పన్నాగం పన్నుతున్నారు. ఇప్పటికే ఆఫ్గనిస్తాన్‌ నుంచి పాక్‌ లోకి తాలిబన్ల చొరబాటుని ముమ్మరం చేశారు. అంతేకాదు పాక్‌లో ఇస్లామిక్‌ రాజ్యం ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు.

Pak-Talibans: పాముకి పాలుపోస్తే ఇలాగే ఉంటుంది.. పాక్‌ లోకి తాలిబన్ల చొరబాటు.. ఇస్లామిక్‌ రాజ్యం ఏర్పాటు చేస్తామని ప్రకటన
Talibans
Follow us
Surya Kala

|

Updated on: Feb 22, 2023 | 9:39 PM

పాముకు పాలు పోసి పోషిస్తే ఏమవుతుంది ? పాకిస్తాన్‌కు పట్టిన గతే పడుతుంది. ఆఫ్గనిస్తాన్‌ నుంచి పాకిస్తాన్‌ లోకి భారీగా చొరబడుతున్నారు తాలిబన్లు. పాకిస్తాన్‌ను అసమర్ధ ప్రభుత్వం ఏలుతోందని , తాము ఇస్లామిక్‌ పాలన తెస్తామని అంటున్నారు ఈ ఉగ్రవాద ముఠా నేతలు. దివాలా తీసిన పాక్‌ ఆర్ధికవ్యవస్థ తాలిబన్లకు వరంగా మారింది. ఆఫ్గనిస్తాన్‌లో ప్రజలు ప్రస్తుతం సంతోషంగా ఉన్నారని, పాక్‌లో తాము పగ్గాలు చేపట్టాక తప్పకుండా ప్రజలకు కష్టాలు తొలగిపోతాయంటున్నారు తాలిబన్‌ నేతలు.

తాలిబన్లకు తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చిందే పాకిస్తాన్‌. అలా శిక్షణ తీసుకున్న తాలిబన్ల నుండి విడిపోయిన వర్గంగా ఉంటూ అదే తాలిబన్లకు పరోక్షంగా పనిచేసే వర్గమే తెహ్రిన్ కి తాలిబాన్ ఈ పాకిస్తాన్.

తాలిబన్లు పాకిస్థాన్ లో ఆశ్రయం తీసుకుని ఆ పాకిస్తాన్నే చెప్పు చేతల్లో తీసుకుని అదుపు చేయాలనుకుంటున్నారు. . అందుకోసం పాకిస్తాన్నే కబ్జా చేయడానికి తమలోని ఒక వర్గాన్ని పెట్టారు. ఇప్పుడు ఆ వర్గాన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ ప్రపంచమంతటా సానుభూతిని పొందుదాం అనుకుంటే, తయారు చేసింది నువ్వే కదా అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..