AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ohio Train: ఒహైయోలో రైలు ప్రమాదం.. గాలిలో కలిసిన ప్రమాదకరమైన గ్యాస్.. క్యాన్సర్‌ కారకాలని హెచ్చరిక

ఒహైయో గూడ్స్ ప్రమాదంపై అమెరికా అలర్టైంది. ఈ ఘటనలో ప్రమాదక గ్యాస్ బుగ్గిపాలవడంతో తాగునీటిపై ఆంక్షలు పెట్టారు అధికారులు. కొన్ని రోజుల పాటు బాటిల్ నీటినే తాగాలని సూచిస్తున్నారు.

Ohio Train: ఒహైయోలో రైలు ప్రమాదం.. గాలిలో కలిసిన ప్రమాదకరమైన గ్యాస్.. క్యాన్సర్‌ కారకాలని హెచ్చరిక
Ohio Train Derailment
Surya Kala
|

Updated on: Feb 17, 2023 | 7:07 AM

Share

అమెరికాలోని ఒహైయోలో జరిగిన గూడ్స్‌ రైలు ప్రమాదం అక్కడ ప్రజల్లో కలకలం రేపుతుంది. అత్యంత ప్రమాదకరమైన గ్యాస్‌లు వాతావరణంలో కలిసినట్లు అధ్యయనంలో తేలింది. దీంతో ప్రజలు బాటిల్‌లోని నీటినే తాగాలని కోరారు ఆ రాష్ట్ర గవర్నర్‌ మైక్‌ డివైన్‌. అయితే ఈనెల 4వ తేదీన ఓ గూడ్స్‌ రైలు ఒహైయో-పెన్సిల్వేనియా రాష్ట్రాల మధ్య ఈస్ట్‌ పాలస్టైన్‌ అనే గ్రామం దగ్గర ప్రమాదానికి గురైంది. 150 బోగీలతో మాడిసన్ నుంచి బయలుదేరిన రైలు పెన్విల్వేనియాలోని కాన్వేకు చేరుకోవాల్సి ఉండగా.. వాటిలోని 50 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 11 బోగీల్లో వినైల్‌ క్లోరైడ్‌, బ్యూటైల్‌ అక్రలేట్‌ వంటి ప్రమాదకర కెమికల్స్‌ను తరలిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన వినైల్‌ క్లోరైడ్‌ గ్యాస్‌ తో పాటు బోగీలు అగ్ని ప్రమాదంలో కాలీ బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన వినైల్‌ క్లోరైడ్‌ గ్యాస్‌లో క్యాన్సర్‌ కారకాలు ఉంటాయని అమెరికా నేషనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ హెచ్చరించింది. దీంతో ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి దాదాపు ఒక మైలు దూరంపాటు గాల్లో చోటు చేసుకొంటున్న మార్పులను అమెరికా పరిశీలిస్తుంది

దీంతో పాటు ప్రమాదం జరిగిన పరిసరాల్లో భూగర్భజలాలను టెస్ట్ చేస్తున్నారు సైంటిస్టులు. టెస్ట్ ల్లో బోర్లలో నీటిని పరీక్షించగా.. ఎలాంటి ప్రమాదం లేదని తేలిందని. ఇంకా కొన్ని పరిశోదనలు జరగాల్సి ఉంది. ప్రజలు అప్పటి వరకు బాటిల్‌ నీటినే వినియోగించాలని చెప్పారు ఆ రాష్ట్ర గవర్నర్‌ మైక్‌ డివైన్‌. మరోవైపు ఆ ప్రాంత పరిసరాల్లోని నదులు, కాల్వల్లోని నీటిని సైతం టెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లోని వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వారిని దాదాపు 5 రోజులపాటు అక్కడే ఉంచి తర్వాత ఇళ్లకు పంపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..