China Earthquake: చైనా సరిహద్దుల్లో భారీ భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై టర్కీని మించిన స్థాయిలో భూకంప తీవ్రత..
భూకంప ప్రకంపనలు చైనా, తూర్పు తజికిస్థాన్‌లను వణికించాయి. ఇటీవల టర్కీలో సంభవించిన భూకంపం కంటే చైనాలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది.
ప్రకృతికి ఎప్పుడు కోపం వస్తుందో.. ఆ ప్రకోపంలో ఎంతటి విధ్వంసం కలుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అవును.. తైవాన్ కకావికలం ఇంకా కళ్ల ముందే కదిలాడుతోంది. ఇంతలో మెక్సికోను మరో ముప్పు.. మొన్నటి మొన్న టర్కీ, సిరియాలు…ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిపోయాయి. వరుసగా భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే.. తీవ్ర భూకంపం ధాటికి అతలాకుతలమైన టర్కీని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. ఇదిలావుంటే.. నిన్న భారత్‌ను వరుస భూ ప్రకంపనలు బెంబేలెత్తించాయి. ఇప్పుడు తాజాగా ఈ ఉదయం చైనా , తజికిస్తాన్ సరిహద్దులో 7.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. చైనాలో గురువారం (ఫిబ్రవరి 23) రాత్రి 8:37 గంటలకు జిన్‌జియాంగ్‌లో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తూర్పు తజికిస్తాన్‌లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.
చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ (సిఇఎన్‌సి) ఉయ్గర్ అటానమస్ రీజియన్‌లో భూకంపాన్ని ధృవీకరించగా, యుఎస్ జియోలాజికల్ సర్వే తజికిస్తాన్‌లో ఈ ప్రకంపనల గురించి తెలియజేసింది. ఇంత ఎక్కువ తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా, అక్కడ పరిస్థితి గురించి మరింత సమాచారం రావల్సి ఉంది.
USGS ఏమి చెబుతుంది..?
USGS అంచనాల ప్రకారం, తజికిస్తాన్‌లో భూకంపం సంభవించిన ప్రాంతం చుట్టూ భారీ పామీర్ పర్వత శిఖరాలు ఉన్నాయి. దీంతో అక్కడ కూడా కొండచరియలు విరిగిపడవచ్చు.. అయితే ఇది ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించదని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో జనాభా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు చైనా పరిస్థితిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం అందలేదు.
భూకంపాలు ఎందుకు వస్తాయి?
భూమిలో 7 పలకలు ఉంటాయి. ఈ ప్లేట్లు నిత్యం కదులుతూనే ఉంటాయి. కానీ ఈ పలకలు ఒకదానితో ఒకటి ఎక్కువగా ఢీకొనే కొన్ని చోట్ల ఇలా ప్రకంపనాలు వస్తుంటాయి. ఈ రకమైన జోన్‌ను ఫాల్ట్ లైన్ అంటారు. పదేపదే ఘర్షణల కారణంగా, ప్లేట్ల మూలలపై ఈ ప్రభావం ఉంటుంది. దీని తర్వాత, ఎక్కువ ఒత్తిడి ఉంటే అప్పుడు పలకలు విరిగిపోతాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం