Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: బెలూన్లతో ప్రేమలో పడి.. పెళ్లి ప్రపోజ్ చేసిన యువకుడు.. వాటికీ ముద్దుతోనే తనకు తెల్లవారుతుందని..

బెలూన్లు చూడగానే తన గుండెల్లో ఏదో అలజడి మొదలవుతుందని అంటాడు. వాటితో సన్నిహితంగా ఉండాలనే కోరిక పెరుగుతుంది. ఈ వింత కోరికతో.. వ్యసనంతో ప్రస్తుతం ఆ యువకుడు నెట్టింట్లో వార్తల్లో నిలిచాడు.   

Viral News: బెలూన్లతో ప్రేమలో పడి.. పెళ్లి ప్రపోజ్ చేసిన యువకుడు.. వాటికీ ముద్దుతోనే తనకు తెల్లవారుతుందని..
Man In Relationship With Ba
Follow us
Surya Kala

|

Updated on: Feb 23, 2023 | 8:11 PM

వ్యసనం చాలా చెడ్డది. కొంతమంది వ్యసనాలు చాలా విచిత్రంగా ఉంటాయి.. అవి వింటే ఎవరైనా షాక్ తింటారు. 28 ఏళ్ల యువకుడికి అలాంటి వింత వ్యసనం ఉంది. ఓ యువకుడు రంగురంగుల బెలూన్లతో ప్రేమలో పడ్డాడు. బెలూన్లు చూడగానే తన గుండెల్లో ఏదో అలజడి మొదలవుతుందని అంటాడు. వాటితో సన్నిహితంగా ఉండాలనే కోరిక పెరుగుతుంది. ఈ వింత కోరికతో.. వ్యసనంతో ప్రస్తుతం ఆ యువకుడు నెట్టింట్లో వార్తల్లో నిలిచాడు.

ఆ యువకుడి పేరు ఆకాష్ మజుందార్. ఇతడిని ‘ఆబ్జెక్ట్ సెక్స్’గా గుర్తించారు. దీనర్థం.. నిర్జీవ వస్తువుల పట్ల కూడా భౌతికంగా ఆకర్షితులయ్యే వ్యక్తులు. ఆకాష్ కు బెలూన్లను ఫ్రెండ్స్ గా భావించేవాడు. అనంతరం.. వాటితో ప్రేమపూర్వక బంధం ప్రారంభమైంది. ఆకాష్ పెరిగి పెద్దదయ్యే కొద్దీ.. బెలూన్‌లతో అనుబంధం మరింతగా పెరిగింది.

ముంబై నివాసి ఆకాష్, NeedToKnow.online‌లో మాట్లాడుతూ.. ‘బెలూన్‌ని చూసిన తర్వాత తనకు ‘ఏదో’ అనిపిస్తుంది.’ అని చెప్పాడు.  బెలూన్‌లతో బెడ్‌ను కూడా పంచుకునే అనుబంధం ఆకాష్‌ సొంతం. అంతే కాదు వాటితో ఆత్మీయ భావాలను కూడా పంచుకుంటాడు.  ప్రేమలో ఉన్న తాను తన భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటానని ఆకాష్ చెప్పాడు. అతను ప్రతి ఉదయం ప్రేమపూర్వకమైన ఉదయాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటాడు. దీంతో  బెలూన్‌లను ఉదయం లేచిన వెంటనే ముద్దు పెట్టుకుంటానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఇది విన్నవారికి వింతగా అనిపిస్తుంది. అయితే ఆకాష్ ఎప్పుడూ బెలూన్లు తన వెంటనే ఉంచుకుంటాడు. ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు కూడా బెలూన్లను తమ వెంట తీసుకెళ్తాడు. బెలూన్లు టెలిపతి ద్వారా తనతో మాట్లాడతాయని ఆకాష్ చెబుతాడు. బెలూన్లు ఆ యువకుడికి స్నేహితురాలు కంటే ఎక్కువ. రెండేళ్ల క్రితమే మోకాళ్లపై నిలబడి బెలూన్‌లకు పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేశాడు.

బెలూన్లు తన ప్రేమను ఒప్పుకున్నప్పటి నుంచి లైఫ్ సెటిల్ అయిందని ఆ యువకుడు చెబుతున్నాడు. అయితే తన గర్ల్ ఫ్రెండ్స్ కు ఎటువంటి ప్రమాదం జరగకుండా పదునైన వస్తువులను దూరంగా ఉంచుతున్నాడు. ఏ బెలూన్ పగిలినా తన గుండె మిగిలిపోతుందని.. అది తనకు అత్యంత విషాదం కలిగించే విషయం అని ఆకాష్ చెప్పాడు. అంతేకాదు.. బెలూన్‌ ఎప్పుడైనా పగిలిపోతే వాటిని భూమిలో పాతిపెడతాడు. బెలూన్లు కూడా మనుషుల పిల్లల్లాగే చాలా సున్నితంగా ఉంటాయని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..