Success Story: తండ్రి వృత్తినే ఎంచుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్.. ఒకేసారి 28 కత్తెర్లను ఉపయోగించే నైపుణ్యం
పని చిన్నదో, పెద్దదో ఏదైనా కానీ ప్రతి పని మిమ్మల్ని కీర్తి శిఖరాలకు తీసుకెళ్తుందని ఆదిత్య చెప్పారు. ఆదిత్య 2021లో ఎంబీఏ చేశారు. ఈ సమయంలో, అనేక బహుళజాతి కంపెనీలు కళాశాల క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించాయి. అందులో అతను ఎంపికయ్యాడు.
విద్య ఎవరికైనా హక్కులను అందించడమే కాదు.. ఈ ప్రపంచంలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పోషించే విషయంలో పోరాడటానికి మిమ్మల్ని యోధునిగా మార్చే ఆయుధం. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ కు చెందిన ఉజ్జయిని యువకుడు 26 ఏళ్ల ఆదిత్య దేవరా నిరూపించాడు. MBA ఉత్తీర్ణత తర్వాత బహుళజాతి కంపెనీలో పనిచేయడానికి బదులుగా, ఆదిత్య తన సాంప్రదాయ, కుటుంబ వ్యాపారాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ హెయిర్ కటింగ్ వ్యాపారం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
పని చిన్నదో, పెద్దదో ఏదైనా కానీ ప్రతి పని మిమ్మల్ని కీర్తి శిఖరాలకు తీసుకెళ్తుందని ఆదిత్య చెప్పారు.. ఆదిత్య 2021లో ఎంబీఏ చేశారు. ఈ సమయంలో, అనేక బహుళజాతి కంపెనీలు కళాశాల క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించాయి. అందులో అతను ఎంపికయ్యాడు. భారీ జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే ఆదిత్య మాత్రం తన కుటుంబ వ్యాపారాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని నిశ్చయించుకున్నాడు. ఎంబీఏ చేశాక తన సొంత హెయిర్ కటింగ్ షాపులో పనిచేయడం ప్రారంభించాడు. అంతేకాదు తన పార్లర్ లో వినూత్న పద్ధతులను ప్రవేశ పెట్టాడు. పెద్ద పెద్ద నగరాల్లో చేసే విధంగా తన షాప్ లో ఫైర్ కటింగ్ వంటివి ప్రారంభించాడు. ప్రపంచంలో హెయిర్ కటింగ్ ఏ విధంగా చేస్తున్నారో యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలుసుకోవడం ప్రారంభించాడు.
గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆదిత్య పేరు చైనాకు చెందిన వ్యక్తి 10 కత్తెరతో ప్రజల జుట్టును కత్తిరించే వీడియో చూసిన ఆదిత్య తాను కూడా అలా ఎందుకు చేయకూడదు అని ఆలోచించాడు. మెల్లగా అలా జుట్టు కత్తిరించడం మొదలుపెట్టాను. అదే సమయంలో ఇరాన్‌కు చెందిన వ్యక్తి 22 కత్తెరలతో, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి 24 కత్తెరతో హ్యారీకట్ చేయడం చూశాడు. దీంతో ఆదిత్య 28 కత్తెర్లతో జుట్టు కత్తిరించడానికి నిరంతరం సాధన చేస్తూనే ఉన్నాడు. చివరకు విజయం సాధించాడు. ఈ నైపుణ్యాన్ని అతను ఇండియా బుక్ అధికారులకు చెప్పడంతో.. భారతదేశంలో ఒక రికార్డు సృష్టించబడింది. అనంతరం ఆదిత్య పేరు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.
5 సంవత్సరాల నిరంతర కృషి ఆదిత్య ఎంబీఏ పాసైన తర్వాత తన తండ్రి చేస్తున్న వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ఉజ్జయిని పేరు దేశమంతటా ప్రసిద్ధి చెందేలా ఏదైనా చేయాలని ప్రయత్నించాడు. ఇప్పుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ , గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆదిత్య పేరు నమోదు అయింది. అయితే దీనికోసం ఆదిత్య ఐదేళ్లు కష్టపడ్డాడు.
హిస్టరీ ఛానల్‌లో ఆదిత్య ప్రతిభ 28 కత్తెరలను ఉపయోగించి జుట్టును కత్తిరించే ఆదిత్య దేవరా నైపుణ్యం ప్రముఖ ఛానల్ లోని OMG యే హై మేరా ఇండియా షోలో చూపించారు. తన ప్రతిభ ద్వారా ఓఎమ్‌జి యే హై మేరా ఇండియా అనే టీవీ షో బృందం తనను సంప్రదించిందని ఆదిత్య చెప్పాడు. ఈ టీమ్ ఇటీవల షూటింగ్ కోసం ఉజ్జయిని వచ్చింది. ఈ కార్యక్రమం 23 ఫిబ్రవరి 2023న రాత్రి 8 గంటలకు ప్రసారం అయింది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..