Drug Scandal: మణిపాల్ యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. 42 మంది విద్యార్ధులను సస్పెండ్ చేసిన యాజమాన్యం..
యూనివర్సిటీలో డ్రగ్స్ వాడుతున్న 42 మంది విద్యార్ధులను యూనివర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. గత ఏడాది నుంచి యూనివర్సిటీలో చాలామంది విద్యార్ధులు డ్రగ్స్ వాడుతున్నారని , పెడ్లర్లతో టచ్‌లో..
కర్నాటక లోని ఉడిపి మణిపాల్ యూనివర్సిటీలో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. యూనివర్సిటీలో డ్రగ్స్ వాడుతున్న 42 మంది విద్యార్ధులను యూనివర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. గత ఏడాది నుంచి యూనివర్సిటీలో చాలామంది విద్యార్ధులు డ్రగ్స్ వాడుతున్నారని , పెడ్లర్లతో టచ్‌లో ఉన్నారని పోలీసులు యాజమాన్యానికి తెలిపారు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేణ్ డ్రగ్స్ వాడుతున్న విద్యార్ధులపై కఠిన చర్యలు తీసుకుంది. డ్రగ్స్ వాడుతున్న విద్యార్ధులను నెలరోజుల పాటు సస్పెండ్ చేస్తునట్టు అధికారులు ప్రకటించారు. నెలరోజుల పాటు విద్యార్ధులు క్లాస్‌లకు హాజరు కారాదని ఆదేశాలు జారీ చేశారు.
సస్పెండైన విద్యార్ధులు నెలరోజుల పాటు క్యాంపస్ లోకి రావద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీలో డ్రగ్స్ విక్రయిస్తున్న చాలామంది డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు కొంతమంది విద్యార్ధులే డ్రగ్ పెడ్లర్లుగా మారినట్టు కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం