Kadiri Narasimha Temple: కాటమరాయుడు బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. నేడు అంకురార్పణ.. 13న తేరు వేడుక

ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఎంతో మహిమ, విశిష్టత కల్గిన ఆ ఆలయంలో స్వామి వారు శ్రీ ఖాద్రి నరసింహునిగా పూజలందుకుంటున్నాడు. నేడు “అంకురార్పణ” తో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Kadiri Narasimha Temple: కాటమరాయుడు బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. నేడు అంకురార్పణ.. 13న తేరు వేడుక
kadiri sri lakshmi narasimha swamy
Follow us

|

Updated on: Mar 02, 2023 | 8:55 AM

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి తరువాత అంత ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం ఉమ్మడి అనంతపురంజిల్లాలోని కదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో కొలువు దీరిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నేడు “అంకురార్పణ” తో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలతో కదిరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడనుంది. జై నారసింహ ధ్వానాలతో మార్మోగనుంది.

శుక్రవారం ప్రధాన ఘట్టం స్వామివారి “కల్యాణోత్సవం” వేడుక నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణాన్ని కన్నులారా వీక్షించడానికి లక్షలాదిమంది భక్తులు హాజరుకానున్నారు. ఈ నెల 13న స్వామివారి బ్రహ్మరథోత్సవం (తేరు) వేడుకను నిర్వహించనున్నారు.  “పుష్పయాగోత్సవం” వేడుకతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

దేశంలో ఎన్నో నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి.. కానీ వాటిలో కేవలం నవ నరసింహాలయాఎంతో ప్రత్యేకత. ఆ నవ నరసింహాలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం.. ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఎంతో మహిమ, విశిష్టత కల్గిన ఆ ఆలయంలో స్వామి వారు శ్రీ ఖాద్రి నరసింహునిగా పూజలందుకుంటున్నాడు. కదిరిలో కొలువైన లక్ష్మీనరసింహ స్వామిని కాటమరాయుడుగా, కదిరి నరసింహుడుగా పిలవబడుతున్నాడు. భక్తుల చేత వసంత వల్లభుడిగా, ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ మహిమాన్విత క్షేత్రం చూడాలంటే.. అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles