Mitchell Starc: కమిట్మెంట్‌ అంటే ఇదేనేెమో..! రక్తం కారుతున్నా బౌలింగ్‌ చేసిన మిచెల్‌ స్టార్క్‌.. వైరల్ అవుతున్న వీడియో..

బౌలింగ్ సమయంలో తన వేలి నుంచి రక్తం కారుతున్నప్పటికీ.. స్టార్క్ బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో..

Mitchell Starc: కమిట్మెంట్‌ అంటే ఇదేనేెమో..! రక్తం కారుతున్నా బౌలింగ్‌ చేసిన మిచెల్‌ స్టార్క్‌.. వైరల్ అవుతున్న వీడియో..
Mitchell Starc Finger Injury
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 03, 2023 | 8:40 AM

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా ఇండోర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో..  ఆస్ట్రేలియా పేసర్ మిచెల్‌ స్టార్క్‌ ఆటపై తనకున్న మక్కువను మరోసారి చాటి చెప్పుకున్నాడు. బౌలింగ్ సమయంలో తన వేలి నుంచి రక్తం కారుతున్నప్పటికీ.. స్టార్క్ బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన క్రికెట్ ఫాన్స్.. స్టార్క్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ‘కమిట్మెంట్‌ అంటే ఇదే..’ అంటూ ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 156/4తో రెండో రోజు(గురువారం) ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 41 పరుగులు జతచేసి చివరి 6 వికెట్లను కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌పై 88 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

మరోవైపు ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (60) హాఫ్ సెంచరీ చేశాడు. ఇక ఈ క్రమంలోనే భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్స్ తీయగా.. ఉమేశ్‌ యాదవ్, అశ్విన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయిన అనంతరం.. భారత్ రెండో ఇన్నింగ్స్‌ని ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్ క్రీజులోకి వచ్చారు. తొలి ఓవర్‌ను ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ వేశాడు. స్టార్క్‌ బంతిని వేసిన అనంతరం అతడి ఎడమ చేతి చూపుడు వేలు నుంచి రక్తం కారుతుంది. రక్తాన్ని తన ప్యాంట్‌కు తుడుచుకుని బౌలింగ్‌ను కొనసాగించాడు. ఇందుకు సంబందించిన దృశ్యాలు టీవీల్లో కనిపించాయి. 2022 చివరి నుంచి స్టార్క్‌ను ఈ గాయం వేధిస్తూనే ఉంది. అప్పటినుంచి పలుమార్లు అదే గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న స్టార్క్ వీడయో..

కాగా, మూడో టెస్టులో ఆస్ట్రేలియా పూర్తి పట్టు సాధించింది. మొదటి రెండో ఇన్నింగ్స్‌లో తడబడిన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో కూడా నిరాశపరిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయిన భారత్‌ 163 పరుగులతో రెండో ఇన్నింగ్స్‌ను కూడా ముగించింది. దీంతో మూడో మ్యాచ్ రెండో రోజు ఆట అక్కడితో ముగిసింది. ఇక ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను శుక్రవారం ప్రారంభిస్తుంది. అంతకముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది.  ఫలితంగా ఆసీస్‌ ఎదుట కేవలం 76 పరుగులను మాత్రమే భారత్‌ లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ఈ స్వల్స ఆధిక్యంతో ఆసీస్ ఆటగాళ్లను భారత బౌలర్లు ఎలా పడగొడతారో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..