AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meg Lanning: ‘ఢిల్లీ కాపిటల్స్‌’ను నడిపించనున్న ఆస్ట్రేలియా కెప్టెన్.. ఆసీస్‌కు 4 టీ20 ప్రపంచకప్‌లు ఆమె సారథ్యంలోనే..

అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో మెగ్‌ లాన్నింగ్‌కు తిరుగులేదు. ఆమె సారథ్యంలోనే ఆస్ట్రేలియా 4 టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. ఈ మధ్యే..

Meg Lanning: ‘ఢిల్లీ కాపిటల్స్‌’ను నడిపించనున్న ఆస్ట్రేలియా కెప్టెన్.. ఆసీస్‌కు 4 టీ20 ప్రపంచకప్‌లు ఆమె సారథ్యంలోనే..
Australia And Delhi Capitals Captain Meg Lanning
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 03, 2023 | 9:55 AM

Share

మహిళల ప్రీమియర్‌ లీగ్ మొదటి సీజన్‌లో ఢిల్లీ కాపిటల్స్‌ను ఆసీస్ క్రికెటర్ మెగ్‌ లాన్నింగ్‌ నడిపించనుంది. ఆస్ట్రేలియాకు ఒంటిచేత్తో విజయాలు అందించినమెగ్‌ లాన్నింగ్‌కే కాపిటల్స్ మేనేజ్‌మెంట్ నాయకత్వ పగ్గాలను అందించింది. మరోవైపు టీమిండియా యువ క్రికెటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ను కాపిటల్స్ జట్టు డిప్యూటీగా ఎంపిక చేసింది. అయితే అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో మెగ్‌ లాన్నింగ్‌కు తిరుగులేదు. ఆమె సారథ్యంలోనే ఆస్ట్రేలియా 4 టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. ఈ మధ్యే దక్షిణాఫ్రికాలో ఆతిథ్య జట్టుతో జరిగిన ఫైనల్లో గెలిచి తన జట్టుకు ఆరో ప్రపంచకప్‌ను అందించింది. ఇక అంతకముందు జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఆమెను ఢిల్లీ జట్టు 1.1 కోట్లకు తమ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఆమె ముంబైకి చేరుకొని ఢిల్లీ శిబిరంలో టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలిసింది.

అయితే ఇప్పటి వరకు 132 టీ20లు ఆడిన లాన్నింగ్‌ 36.61 సగటు, 116.7 స్ట్రైక్‌రేట్‌తో 3405 పరుగులు చేసింది.  ఇందులో 15 హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియాకు 100 టీ20ల్లో సారథ్యం వహించిన అనుభవం కూడా అమెకు ఉండడం విశేషం. ఢిల్లీ మేనెజ్‌మెంట్ తనను ఆ జట్టుకు కెప్టెన్‌గా నియమించిన సందర్భంగా లాన్నింగ్ మాట్లాడుతూ..  ‘నేనిది గర్వపడే సందర్భం. మొదట దిల్లీ క్యాపిటల్స్‌లో చేరాను. ఇప్పుడు జట్టును నడిపించబోతున్నాను. ఆటను ఆస్వాదిస్తూ అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకురావడమే ముఖ్యం. క్రీడారంగంలో డబ్ల్యూపీఎల్‌ ఓ గొప్ప ముందడుగు. ఇదెంతో తెలివైన చర్య. భారత ప్రజల మనసుల్లో క్రికెట్‌ జీవిస్తోంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ను వారు కచ్చితంగా ఆదరిస్తారు. ఇలాంటి లీగ్‌లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఈ లీగ్ మరింత ఎదుగుతుంది’ అని మెగ్‌ లాన్నింగ్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

కాగా, WPL 2023 మొదటి మ్యాచ్ శనివారం(మార్చి 4)న జరగనుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ తొలి మ్యాచు(లీగ్ రెండో మ్యాచ్)లో పటిష్ఠమైన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఎదుర్కోనుంది. మార్చి 5న బ్రబౌర్న్‌ స్టేడియంలో ఈ రెండు జట్లు కూడా తలపడనున్నాయి. ఇక మహిళల ప్రీమియర్‌ లీగ్‌లోని 5 జట్లలో మూడింటిని ఆసీస్‌ క్రికెటర్లే నడిపిస్తుండటం గమనార్హం. గుజరాత్‌ జెయింట్స్‌కు బెత్‌ మూనీ, యూపీ వారియర్స్‌కు అలీసా హేలీ సారథ్యం వహిస్తుండగా.. ఆర్సీబీకి స్మృతి మంధాన, ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్లుగా బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..